డ్రగ్స్ కి బానిసగా మారిన టాప్ హీరో .. సౌత్ ఇండియా మొత్తం భయపడింది.

డ్రగ్స్ .. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పెద్ద భూతం. ఒక్కసారి ఈ డ్రగ్స్ అలవాటైతే స్టార్ హీరో.. హీరోయిన్స్.. దర్శకులు.. ఇలా ఒకరేమిటీ ప్రతీ ఒక్కరినీ నాశనం చేస్తోంది. ఈ వ్యసనానినికి అలవాటు పడిన పలువురు సినీ తారలు ఎన్నో ఏళ్ళుగా కష్టపడి సంపాదించుకున్న అద్బుతమైన కెరీర్ ని సర్వ నాశనం చేసేసుకుంటున్నారు. ఈ డ్రగస్ వ్యవహారంలో ఉన్నట్టు ఒక్కసారి పేరు బయటకి వస్తే దాదాపు సినిమా కెరీర్ క్లోజ్ అన్నట్టుగా అయిపోయాయి జీవితాలు. గతంలో టాలీవుడ్ ని కుదిపేసిన ఈ డ్రగ్స్ వ్యవహారం మళ్ళీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ తర్వాత అన్ని సినిమా ఇండస్ట్రీలలో సంచలనం గా మారింది. 

Saala Khadoos Review |

కాగా తాజాగా ఈ డ్రగ్స్ కి ఒక స్టార్ హీరో బానిసయ్యాడని సోషల్ మీడియాలో న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతోంది. అతనెవరో కాదు నటుడిగా, రచయితగా, నిర్మాతగా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో గుర్తింపును సంపాదించుకున్నారు మాధవన్. మాధవన్ ఆ మధ్య సాలా ఖదూస్ సినిమాతో సెన్షేషనల్ హిట్ అందుకున్నాడు. హిందీ, తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాతో భారీ సక్సస్ ని అందుకున్నాడు మాధవన్. ఇక రీసెంట్ గా అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్ధం అన్న పాన్ ఇండియన్ సినిమాలో కూడా మాధవన్ కీలక పాత్ర పోషించాడు.

Nishabdham on Amazon Prime Video, with Anushka Shetty and Madhavan: A  dreadful thriller | Baradwaj Rangan

రీసెంట్ గా ఒక లేడీ నెటిజన్ మాధవన్ ను టార్గెట్ చేసి సోషల్ మీడియా లో తాను మాధవన్ కు పెద్ద అభిమానినని… మాధవన్ డ్రగ్స్, మద్యానికి బానిసయ్యాడని సంచలన వ్యాఖయలను చేసింది. అంతేకాదు ఈ అలవాట్ల తో తన ఫేవరెట్ హీరో కెరీర్, హెల్త్ ను నాశనం చేసుకుంటున్నాడని చెప్పుకొచ్చింది. మాధవ ఇలా అవడానికి కారణం పరోక్షంగ బాలీవుడ్ ఇండస్ట్రీ అని కూడా తెలిపింది. మాధవన్ ఆ ట్వీట్ కు స్పందిస్తూ “ఓహో. మీరు చేసేది ఇదా.? మీరు త్వరగా డాక్టర్ అపాయింట్ మెంట్ తీసుకుంటే బాగుంటుంది” అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఇదంతా కేవలం రూమరేనని ఫ్యాన్స్ కొట్టిపారేశారు.