టాలీవుడ్ సేఫ్ పొలిటికల్ గేమ్.!

కె. రాఘవేంద్రరావు, అశ్వనీదత్, కేఎస్ రామారావు.. ఇలా కొందరు సినీ పరిశ్రమ తరఫున, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి మద్దతు పలికారు బహిరంగంగా.. ఆయన అరెస్టుని నిరసిస్తూ.

పవన్ కళ్యాణ్ సినీ నటుడే అయినా, ఓ రాజకీయ పార్టీ అధినేత.. పైగా, టీడీపీతో రాజకీయంగా పొత్తు పెట్టుకుంటున్నారు. సో, ఆయన మద్దతివ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ, పరిశ్రమలో చాలామంది సినీ ప్రముఖులు సేఫ్ గేమ్ వైపే మొగ్గు చూపుతున్నారు.

ప్రభుత్వంలో ఎవరున్నా, పరిశ్రమ తరఫున.. ఆయా ప్రభుత్వాలతో సన్నిహితంగా వుండాలి. సన్నిహితంగా వున్నా లేకపోయినా.. విభేదాలైతే వుండకూడదు. ఈ విషయమై ఇటీవల పరిశ్రమలో లోతైన చర్చ జరిగిందట కొందరు ప్రముఖుల మధ్యన.

దాంతో, ఒకరొకరుగా ఏదో ఒక వంకతో మీడియా ముందుకొచ్చి, ‘మేం స్పందించం.. ఎవరు ప్రభుత్వంలో వున్నా, వారితో వైరం మేం కోరుకోం..’ అని చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని టీడీపీతో అనుబంధం వున్న కొందరు సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. అలా జీర్ణించుకోలేని బ్యాచ్‌లోని కొందరు కూడా గట్టిగా నోరు పెగల్చలేని పరిస్థితి.

ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే.? అన్న ఆలోచనతోనే, టాలీవుడ్‌కి చెందిన మెజార్టీ ప్రముఖులు సేఫ్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నారట.