మూడు పదుల వయసు దాటినా.. చేతినిండా సినిమాలు చేస్తూ.. ఏమాత్రం కూడా గ్లామర్ తగ్గకుండా మెయిన్ టేన్ చేస్తోంది ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ చందమామ అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
తర్వాత వరుస పెట్టి అందరు స్టార్ హీరోలతో నటించింది ఈ అమ్మడు. అయితే.. 30 ఏళ్ల వయసు దాటినా ఇంకా కాజల్ పెళ్లి మాట ఎత్తడం లేదని ఓ వైపు వార్తలు వస్తుంటే.. కాజల్ మాత్రం తన అభిమానులకు షాక్ ఇచ్చింది.
ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లి ఫిక్స్ చేసుకున్నదట కాజల్. గౌతమ్ అనే బిజినెస్ మెన్ తో కాజల్ కు నిశ్చితార్థం కూడా అయిపోయిందట. చాలాకొద్ది మంది గెస్టులతో కాజల్ నిశ్చితార్థాన్ని కానిచ్చారట.
నిశ్చితార్థం అయిపోయింది.. త్వరలో పెళ్లి కూడా కాబోతున్నది కానీ.. కాజల్ మాత్రం ఇప్పటి వరకు తన పెళ్లి గురించి తన అభిమానులకు ఒక్క మాట కూడా చెప్పకపోవడంతో కాజల్ అభిమానులు ఓ వైపు బాధపడుతున్నా… తమ ఫేవరేట్ హీరోయిన్ పెళ్లి అవుతోందని ఖుషీ అవుతున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తన నిశ్చితార్థానికి టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హాజరయ్యాడట. పెళ్లి హడావుడి కూడా ప్రారంభం అయిందట.
అయితే.. ప్రస్తుతం కాజల్ చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఓవైపు చిరంజీవి ఆచార్యలో నటిస్తుండగా.. మరోవైపు భారతీయుడు 2 సినిమాలోనూ నటిస్తోంది. అందుకే తన పెళ్లిని దృష్టిలో పెట్టుకొని తన షూటింగ్ పార్ట్ ను ముందే పూర్తి చేయాలంటూ అటు కొరటాల శివకు, ఇటు శంకర్ కు చెప్పిందట.
దీంతో కాజల్ షూటింగ్ పార్ట్ ను ముందుగా పూర్తి చేసేందుకు కొరటాల కూడా షెడ్యూల్ ను మార్చాడట. ప్రస్తుతానికి కాజల్ ఈ రెండు సినిమాలు చేస్తోంది. వేరే సినిమాలు ఒప్పుకోలేదు. వీటి షూటింగ్ చకచకా పూర్తి చేసేసుకొని పెళ్లి చేసుకొని కొన్ని రోజుల పాటు సినిమాలకు గ్యాప్ ఇస్తుందేమో.. అని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది.