టాలీవుడ్ బిగ్ మూవీస్.. ఈ ఏడాది పండగే!

ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా తెరకేక్కుతున్నాయి. అలాగే టైర్ 1 హీరోల నుంచి కూడా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఈ నేపధ్యంలో టాలీవుడ్ లో ఈ సినిమాల మీద నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టడంతో పాటు, వాటి నుంచి భారీ కలెక్షన్స్ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలుగులో అత్యధికంగా థీయాట్రికల్ బిజినెస్ జరుపుకుని రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల జాబితా చూసుకుంటే.

జూన్ 16న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం ఏకంగా 400 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. తరువాత జులై 28న పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న వినోదాయ సీతమ్ రీమేక్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ మూవీ షూటింగ్ పవన్ కళ్యాణ్ తాజాగా పూర్తి చేయడం విశేషం.

ఇక జులై లేదా ఆగష్టులో బోయపాటి, రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వం లో చేస్తున్న భోళా శంకర్ మొవుఎ ఆగష్టు 11న రిలీజ్ కాబోతుంది. వాల్తేర్ వీరయ్య సక్సెస్ తో భోళా శంకర్ గా మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. సెప్టెంబర్ 28న ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ద్వారా వెయ్యి కోట్ల టార్గెట్ ని అందుకోవాలని భావిస్తున్నారు.

ఇక అక్టోబర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో పవన్ నుంచి రాబోతున్న మొదటి సినిమా ఇది కావడం విశేషం. ఇక అక్టోబర్ లేదా జనవరిలో సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతుంది.