బూమ్ బూమ్ బీర్ పై ప్రముఖ నటుడు షాకింగ్ వీడియో వైరల్..!

టాలీవుడ్ సినిమా వద్ద తమ టాలెంట్ తో ఏ ఏజ్ లో అయినా సరే మంచి ఫేమ్ ని పలువురు నాట్లు తెచ్చుకుంటారు. అలానే ఇప్పుడు మంచి మంచి వేషాలకి మంచి డిమాండ్ ఉన్న నటుల్లో అయితే ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాల్లో నటించిన తాను కామెడీ, ఎమోషనల్, విలన్ పాత్రల్లో కూడా కనిపించి మెప్పించారు.

ఇక రీసెంట్ గానే సామజవరగమనా సినిమాలో మంచి పాత్ర పోషించిన తాను రియల్ లైఫ్ కి వచ్చేసరికి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అంతే కాకుండా సినిమాలు ఎంపిక విషయంలో కూడా చాలా పర్టిక్యులర్ గా కేవలం తన నటనకి స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుంటారు. ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పిన తాను ఇలా టాలీవుడ్ లో మోస్ట్ బిజీ నటుల్లో ఒకరిగా ఐతే ఉన్నారు.

ఇది బాగానే ఉండగా తాజాగా తాను పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారిపోయింది. తాను ఏదో పని మీద బెజవాడ వస్తే అక్కడ తనకి ఏదో మనసు బాలేక మందు తాగుదాం అనుకున్నాను అని బీర్ తెచ్చుకున్నారు.

అయితే తాను తెచ్చుకున్న బీర్ ని చూపించి నా పేరు శ్రీకాంత్ అయ్యంగార్ రీసెంట్ గానే శ్రీకాంత్ భారత్ గా మార్చుకున్నాను ఈ విషయం నా వాళ్ళకి కూడా చెప్పలేదు మీకే చెప్తున్నాను తాగాక ఏమవుతుందో తెలీదు అంటూ ఓ సూసైడ్ వీడియో లాంటిది రిలీజ్ చేశారు.

మరి బీర్ ఇంకేదో కూడా కాదు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యే బూమ్ బూమ్ బీరే.. దీనితో తాను కూడా ఇలా సెటైరికల్ వీడియోని పోస్ట్ చేయడం అనేది ఇప్పుడు మంచి వైరల్ గా మారింది. మరి దీనిపై ఏపీ ముఖ్యలు నుంచి ఏమన్నా రియాక్షన్ ఉంటుందేమో చూడాలి.