Tollywood:ఏపీ ప్రభుత్వానికి చిత్రపరిశ్రమకు మధ్య గత కొద్ది రోజుల నుంచి సినిమా టికెట్ల విషయంపై ఎన్నో వివాదాలు విమర్శలు చోటుచేసుకున్నాయి. సినిమా టికెట్ల విషయంపై సినీ ప్రముఖులు ఏపీ మంత్రుల మధ్య కోల్డ్ వార్ జరిగింది. ఇలా వీరి మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చోటు చేసుకున్న అనంతరం మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఇలా ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత ఆయన సానుకూలంగా స్పందించారని వార్తలు వచ్చాయి. అయితే జగన్ ను చిరంజీవి వ్యక్తిగత కారణాల వల్ల కలిశారని ఆరోపణలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి కొరటాల శివ వంటి తదితరులు మరోసారి ముఖ్యమంత్రిని కలిసి సినిమా సమస్యల గురించి వివరించారు.ఇలా సినీ పరిశ్రమలోనీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో తాను ఈ విషయాలపై సానుకూలంగా స్పందించి సినిమా టికెట్ల రేట్లను పెంచుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే సినీ పరిశ్రమ సమస్యలపై స్పందించిన ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ కొత్త జీవో విడుదల చేసింది.
ఈ విధంగా సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో ఊరట లభించిందని సినీ ప్రముఖులు భావించారు. ఈ క్రమంలోని ఏపీ ముఖ్యమంత్రికి పలువురు సినీ ప్రముఖులు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే సినిమా కష్టాలను విని సినిమా పరిశ్రమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి టాలీవుడ్ సెలబ్రిటీలు కలవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనకు సన్మానం చేయాలని భావించినట్లు తెలుస్తోంది అయితే ముఖ్యమంత్రి డేట్స్ అడ్జస్ట్ అయితే తప్ప ఈ విషయం గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు లేవు. అయితే గతంలో కొందరు తమను ముఖ్యమంత్రిని
కలవడానికి ఆహ్వానించలేదని విమర్శలు చేశారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరెవరు వెళ్తున్నారనే విషయంపై కూడా ఆత్రుత నెలకొంది.