టీమిండియా యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో ఒక ముద్ర వేశారు. ఇటీవల అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న తిలక్ వర్మ బ్యాటింగ్ విభాగంలో భారీ దూకుడు ప్రదర్శించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 72 పరుగులతో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన తిలక్.. తన ర్యాంక్‌ను కూడా మరింత మెరుగుపరుచుకున్నాడు.
ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో 832 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇదే సమయంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ విభాగంలో సంచలనానికి తెరలేపాడు. 25 స్థానాలు ఎగబాకి 679 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వరుసగా జట్లు మారుస్తూ టీమిండియాలో తన స్థానాన్ని రుజువు చేసుకుంటున్న వరుణ్.. ఇప్పుడు ప్రపంచ స్థాయిలోనూ తన ప్రతిభను చూపిస్తున్నాడు.
మరో భారతీయ బౌలర్ అక్షర్ పటేల్ కూడా ర్యాంకింగ్స్‌లో మెరుగుదల చూపించి 11వ స్థానాన్ని అందుకున్నాడు. టీ20 బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ 855 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ ర్యాంక్‌లో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇక లిస్ట్‌ను ఒకసారి పరిశీలిస్తే:
టీ20 టాప్ 5లో ఉన్న బ్యాట్స్ మెన్స్
ట్రావిస్ హెడ్ – 855
తిలక్ వర్మ – 832
ఫిల్ సాల్ట్ – 782
సూర్యకుమార్ యాదవ్ – 763
జోస్ బట్లర్ – 749
టీ20 టాప్ 5లో కొనసాగుతున్న బౌలర్లు
ఆదిల్ రషీద్ – 718
ఆకీల్ హొసెన్ – 707
వానిందు హసరంగ – 698
ఆడమ్ జంపా – 694
వరుణ్ చక్రవర్తి – 679

