ఏదైనా నిర్దిష్ట పని పూర్తి కావాలని మనసులో సంకల్పం పెట్టుకుని దేవతా మూర్తులకు పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా భగవంతుని పాదాల వద్ద సంకల్పాన్ని ఉంచి, ఆ కార్యానికి శుభ ఫలితం కలగాలని ప్రార్థిస్తే ఆ పూర్తి అవుతుందని భావిస్తారు. వారంలో కొన్ని ఒక్కో రోజు ప్రత్యేక పూజలు మనకి ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక బలం ఇస్తూ, కార్యసాధనకు మార్గం సుగమం చేస్తాయని చాలా మంది నమ్మకం.
ఇక పెళ్లి కాని అమ్మాయిలకు.. జాతకంలో అడ్డంకులు ఉన్నా, సంబంధాలు కొలిక్కి రాకపోయినా.. గురువారం ఉపవాసం చేయడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయని పెద్దలు అంటున్నారు. శాస్త్రానుసారం నవగ్రహాల్లో బృహస్పతి వివాహానికి, సంతానానికి, సంపదకు ప్రధాన కారకుడు. గురువారం బృహస్పతిని ప్రత్యేకంగా పూజిస్తే ఆయా సమస్యలు తొలగి, మంచి పరిష్కారం దొరుకుతుందంటున్నారు.
ఈ రోజున శ్రీ మహా విష్ణువును, లక్ష్మీ దేవిని పూజిస్తే వారి అనుగ్రహం దక్కుతుందట. ఉపవాసం వల్ల మనసుకు ప్రశాంతత, ఆధ్యాత్మిక బలమే కాదు, ఇంటికి ఐశ్వర్యం, సాంతానం కూడా కలుగుతుందనే విశ్వాసం ఉంది. అంతేకాదు వివాహితలు తమ దీర్ఘాయుష్కు, దాంపత్య సుఖానికి ఈ ఉపవాసాన్ని ఆచరిస్తే మంచిదని చెబుతుంటారు.
పిల్లల సమస్యలు ఎదుర్కొంటున్న దంపతులు కూడా గురువారం ఉపవాసం ఉంటే.. సంతాన భాగ్యం కలుగుతుందని పెద్దల మాట. ఒక్కసారి ఈ వ్రతాన్ని ప్రారంభిస్తే.. ప్రతీ గురువారం ఆచరించడం మంచిదని, ఈ విధంగా బృహస్పతి బలపడి జాతకంలో శుభ యోగాలు ఏర్పడతాయని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. శాంతి, సంపద, సంతాన సుఖం.. ఇవన్నీ ఒకే ఉపవాసంతో లభిస్తాయని చెబుతున్నారు. కనుక, శ్రద్ధగా, భక్తిగా బృహస్పతిని పూజించి.. జీవితం కొత్త మార్గంలో నడిపించుకోండి. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)