“బ్రో ది అవతార్” లో ఐటెం సాంగ్ కి ఈ యంగ్ సెన్సేషన్.?

ఇపుడు టాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ ఏదన్నా ఉంది అంటే అది గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ లు నటిస్తున్న “బ్రో ది అవతార్” అనే చెప్పాలి. ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకునిగా తెలుగులో చేస్తున్న మొదటి సినిమానే ఇది కాగా ఇప్పుడు షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ అవైటెడ్ సినిమా నుంచి ఒకో అప్డేట్ మంచి బజ్ ని తీసుకొస్తూ ఉండగా ఈ సినిమా పై ఇపుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకి వచ్చింది. ఈ సినిమాలో ఆల్రెడీ 5 పాటలు ఉంటాయని టాక్ ఉంది. ఇప్పటికే థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరగ్గొట్టేసాడు.

అయితే మేకర్స్ ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒరిజినల్ లో సాంగ్ లేకపోయినప్పటికీ ఇందులో మాత్రం ప్లాన్ చేస్తున్నారట. కాగా మరి ఈ సాంగ్ కోసం ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర లేటెస్ట్ యుంగ్ సెన్సేషన్ అయినటువంటి శ్రీ లీల ని పట్టుకున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇది వరకే ఈ సాంగ్ కి మరో హాట్ బాంబ్ కేతిక శర్మ లాక్ అయ్యినట్టుగా టాక్ వచ్చింది. కానీ ఫ్రెష్ గా ఐతే శ్రీ లీల పేరు బయటకి వచ్చింది. మరి ఇద్దరిలో ఎవరు ఫైనల్ అనేది ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. అలాగే మరోపక్క శ్రీ లీల పవన్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” అనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.