ఇన్నేళ్ల సినీ హిస్టరీలో సౌత్ ఇండియా సినిమా దగ్గర ఒక పాత్ బ్రేకింగ్ చిత్రాల్లో తమిళ సెన్సేషనల్ హిట్ చిత్రం “చంద్రముఖి” కూడా ఒకటి. అయితే ఇది అంతకు ముందే కన్నడ భాషలో ఉన్నప్పటికీ సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన తర్వాతే భారీ గుర్తింపు తెచ్చుకుంది.
దీనితో తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కింది. ఇక ఇదిలా ఉండగా మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ అయితే ఫైనల్ గా రాబోతుంది. కాకపోతే ఈసారి సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటించగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చంద్రముఖిగా నటించింది.
అయితే అనౌన్స్ అయ్యినపుడు మంచి క్రేజ్ ని సినిమా తెచ్చుకుంది. కానీ ఇప్పుడు అయితే ఏమంత గొప్ప హైప్ సినిమా మీద లేదు అనే ఎక్కువ వినిపిస్తుంది. కాగా ఇపుడు సినిమా రిలీజ్ డేట్ ని అయితే మేకర్స్ ఈ సెప్టెంబర్ 15న వినాయక చవితి కానుకగా రిలీజ్ చేస్తున్నారని ఫిక్స్ అయ్యింది.
కానీ ఈ చిత్రం ఇప్పుడు ఈ డేట్ నుంచి సినిమా రిలీజ్ ఆపేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే కొన్ని టెక్నీకల్ కారణాలు మూలాన ఆపినట్టుగా తెలిపారు. అయితే ఈ సినిమా వాయిదా కి ప్రధానం కారణం మాత్రం సినిమా గ్రాఫిక్స్ వర్క్ ఇంకా కంప్లీట్ లేదు అట. దీనికి ఇంకా కొన్ని రోజులు సమయం పడుతుంది అని అందుకే సెప్టెంబర్ 15 నుంచి 28 డేట్ కి లాక్ చేశారు అని ఇప్పుడు తెలుస్తుంది. మరి సినిమా రిజల్ట్ మాత్రం ఎలా ఉంటుందో చూడాలి.