ఇండస్ట్రీ టాక్ : “హరిహర వీరమల్లు 2” రిలీజ్ అప్పుడా.?

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు”. పవన్ నుంచి వస్తున్న  పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. దీనితో సినిమాపై మాత్రం అనేక అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమా షూటింగ్ ఇంకా 30 శాతానికి పైగా బ్యాలన్స్ ఉండగా.

మళ్ళీ దీనిని పవన్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తారు అనేది ఇంకా తెలియరాలేదు. అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు సినిమానే ప్రశ్నార్ధకం అంటే పవన్ ని నమ్మి రెండో సినిమా ఎలా అని అంతా ఆలోచిస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ రెండో సినిమా రిలీజ్ పై అప్పుడిదే ఇండస్ట్రీ వర్గాల నుంచి బజ్ వినిపిస్తుంది. వీటితో అయితే ఈ రెండో సినిమా 2024 లోనే వచ్చేస్తుందని అంటున్నారు. ఆ ఏడాదిలోనే పవన్ ఎన్నికలు ఇప్పుడు ఎన్నికలు లేకుండానే ఇంత సాగదీసిన పవన్ ఇక అపుడే రెండో సినిమా కూడా కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం అనేది అనుమానమే అని చెప్పాలి.

అయితే ఈ మొదటి భాగం అయితే ఈ ఏడాది దసరా కానుక గానే తీసుకొచ్చే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని సమాచారం. కాగా ఈ సినిమాని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే పలువులు బాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.