“సలార్” నుంచి నెక్స్ట్ ఒచ్చేది ఈ ట్రీటే అట.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇపుడు నటించిన భారీ చిత్రం “ఆదిపురుష్” ఫీవర్ మరోసారి మొదలైంది. నిన్న రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ తాలూకా రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. దీనితో ఈ సినిమా పై హైప్ ఓ రేంజ్ లో నెలకొనగా ఈ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి రిలీజ్ కి రానున్న సెన్సేషనల్ సినిమా “సలార్” కోసం కూడా అందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజి లోకి వచ్చేసింది. కాగా ఈ సినిమా అప్డేట్ కోసం అయితే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇవేవి అయితే ఆదిపురుష్ రిలీజ్ అయ్యే వరకు ఉండకూడదు అని మేకర్స్ కి ప్రభాస్ అల్టిమేటం కూడా ఇచ్చేసినట్టుగా తెలిసింది.

కాగా అయితే నెక్స్ట్ సలార్ నుంచి అయితే ఎలాంటి ట్రీట్ రానుందో తెలుస్తుంది. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ అయితే ఆదిపురుష్ రిలీజ్ తర్వాత అవైటెడ్ వీడియోని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సలార్ గ్లింప్స్ కోసం ఎప్పుడు నుంచో సాలిడ్ హైప్ ఉంది. మరి దీనిపై అయితే అధికారిక క్లారిటి ఇంకా రావాల్సి ఉంది.

ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్ర వహిస్తున్నాడు. అలాగే కేజీఎఫ్ ఫేమ్ రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే హోంబలే ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ బడ్జెట్ తో ఓ ఫ్రాంచైజ్ గా అయితే ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.