వైరల్ ఫ్యాక్ట్ : మహేష్ వదిలేసిన ఆ సినిమానే ఈ సినిమా.. 

టాలీవుడ్ సినిమా దగ్గర ఇప్పుడు ఎంతమంది బిగ్ స్టార్స్ ఉన్నప్పటికీ పాన్ ఇండియా క్రేజ్ పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇద్దరే అతి పెద్ద సూపర్ స్టార్ లు ఉంటారు. వారే సూపర్ స్టార్ మహేష్ బాబు అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాల్లో పీక్ క్రేజ్ అండ్ బాక్సాఫీస్ ని చూసేసారు.

మరి వారిలో మహేష్ బాబు అయితే తన సినిమా కెరీర్ లో ఎన్నో చిత్రాలు వదులుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాల్లో మరో హీరోతో చేసే సరికి భారీ హిట్స్ అయ్యి కూచ్చున్నాయి. కాగా ఇప్పుడు అలా మహేష్ వదిలేసుకున్న మరో సినిమా కోసమే ఇప్పుడు ఇండియన్ సినిమా మాట్లాడుకుంటుంది.

మరి ఆ సినిమా ఏదో కూడా కాదు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో దర్శకుడు సందీప్ వంగ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా “ఆనిమల్”. నిన్న టీజర్ వచ్చాక అయితే మహేష్ నుంచి పాత న్యూస్ లు బయటకి వచ్చాయి. ఈ సినిమా స్టార్ట్ కాక ముందే దర్శకుడు సందీప్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ కూడా వైరల్ అవ్వడం మొదలైంది.

దీనితో తాను ఈ కథ మొదట మహేష్ బాబుకే చెప్పడం జరిగింది అని కానీ మహేష్ దానిని రిజెక్ట్ చేసారని దీనితో ఆ కథను రణబీర్ కి చెప్తే ఓకే చేసాడని అలా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది అని తెలిపారు. దీనితో ఈ సినిమా టీజర్ చూసాక మాత్రం మహేష్ ఫ్యాన్స్ పడుతున్న బాధ వర్ణనాతీతం. ఇలాంటి సినిమా వదిలేసుకున్నాడని వారు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.