ఇండస్ట్రీ టాక్ : “పుష్ప 2” లో అన్నిటికన్నా బిగ్గెస్ట్ హైలైట్ ఇదే

పాన్ ఇండియా మార్కెట్ లో అయితే తన సొంత బ్రాండ్ తో పేరు తెచ్చుకున్న ఏకైక టాలీవుడ్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి. కాగా అల్లు అర్జున్ తన పాన్ ఇండియా చిత్రం పుష్ప సినిమా ఎపుడు అయితే చేసాడో అక్కడ నుంచి పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా మారిపోయాడు.

దీనితో పుష్ప సినిమా తర్వాత బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోగా ఇప్పుడు దీనికి సీక్వెల్ “పుష్ప 2” పై మాత్రం భారీ హైప్ నెలకొంది. కాగా ఈ సినిమాని సుకుమార్ ఎలాంటి కంగారు లేకుండా చాలా నిదానంగానే తీస్తుండగా ఇప్పుడు ఒక బ్లాస్టింగ్ అప్డేట్ అయితే సినీ వర్గాలు నుంచి ఈ సినిమాపై వినిపిస్తుంది.

దీనితో “పుష్ప 2” లో ఇప్పుడు దర్శకుడు సుకుమార్ అండ్ ఓ భారీ సీన్ ని జాతరపై తెరకెక్కించారట. కేవలం ఈ సీన్ కోసం వేసిన ఓ గ్రాండ్ సెట్టింగ్ లో దీనిని సుకుమార్ అల్లు అర్జున్ పై తెరకెక్కించగా ఈ సీక్వెన్స్ ఈ సినిమాలోనే బిగ్గెస్ట్ హైలైట్ గా నిలవబోతుంది అని సినీ వర్గాల వారు అంటున్నారు.

అంతే కాకుండా దీని తర్వాత అక్కడే ఓ క్రేజీ ఏక్షన్ సీక్వెన్స్ ని మరియు ఓ గ్రాండ్ సాంగ్ ని కూడా చిత్రీకరించారు అని వాటి అవుట్ ఫుట్ కూడా అద్భుతంగా వచ్చింది అని ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇప్పుడు సమాచారం. మొత్తానికి మాత్రం దర్శకుడు సుకుమార్ మరియు బన్నీలు మళ్ళీ ఓ రేంజ్ లో ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అనిపిస్తుంది.