జెనరల్ గా ఏ పాన్ ఇండియా హిట్ సినిమా సీక్వెల్ అయినా కూడా భారీ హైప్ తో వస్తాయి కానీ దానికి విరుద్ధంగా తమిళ గత ఏడాది భారీ హిట్ సినిమా “పొన్నియిన్ సెల్వన్” సీక్వెల్ అయితే చాల తక్కువ హైప్ తో వచ్చింది. దీనికి కారణాలు పక్కన పెడితే పార్ట్ 1 తో పోలిస్తే దీనికి షాకింగ్ వసూళ్లు అన్ని చోట్లా అందులోని మన తెలుగులో కూడా వచ్చినట్టుగా తెలుస్తున్నాయి.
అయితే పిఎస్ 1 చిత్రం వరల్డ్ వైడ్ గా సుమారు 600 కోట్లు గ్రాస్ కొల్లగొట్టింది ఇది మామూలు విషయం కూడా కాదు. ఇక పార్ట్ 2 కి దీనికి మించి ఎక్కువ వసూళ్లు రావాలి కానీ ఈ చిత్రం పార్ట్ 1 తో పోలిస్తే భారీ మార్జిన్ తో తక్కువ వసూళ్లు వచ్చినట్టుగా తెలుస్తుంది.
కాగా పొన్నియిన్ సెల్వన్ 1 కి వరల్డ్ వైడ్ గా 80 కోట్ల మేర ఓపెనింగ్స్ దక్కగా పార్ట్ 2 కి మాత్రం కేవలం 60 కోట్ల మేర గ్రాస్ మాత్రమే వచ్చిందట. అయితే తెలుగు స్టేట్స్ లో పార్ట్ కి దారుణమైన టాక్ వచ్చినప్పటికీ మన వాళ్ళు 2.5 కోట్ల మేర గ్రాస్ ని అందించించడం విశేషం.
ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే ఈ చిత్రం ఇండియా మొత్తం 27 కోట్లు రాబట్టగా మిగతా అంతా ఓవర్సీస్ మార్కెట్ నుంచే రాబట్టింది. అయితే గత సినిమాకి కూడా ఓవర్సీస్ వసూళ్లే భారీ గా ప్లస్ అయ్యాయి. ఇప్పుడు పార్ట్ 2 కి కూడా అదే జరుగుతుంది.
దీనితో ఈ చిత్రం కూడా మెల్లగా రికార్డు వసూళ్లు అందుకుంటుంది అని చెప్పొచ్చు. ఇక విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ తదితరులు నటించారు. అలాగే దిగ్గజ దర్శకుడు మణిరత్నం తన డ్రీం ప్రాజెక్ట్ గా దీనిని తెరకెక్కించారు.