ప్చ్..కేవలం ఒక్క సినిమా ఆఫర్ తో మెగా మ్యూజిక్ డైరెక్టర్.?

టాలీవుడ్ లో ఎందరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. మరి ఇప్పుడుకి కూడా సీనియర్ సంగీత దర్శకులు తమ సంగీతంతో అలరిస్తుండగా కొందరు మంచి బిజీగా ఉన్నారు కొందరు కేవలం కొన్ని చిత్రాలతో మాత్రమే వర్క్ చేస్తున్నారు. ఇక మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సంగీత దర్శకుల్లో మణిశర్మ కోసం ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు.

తన కెరీర్ లో ఓ టైం లో బ్రేక్ వచ్చాక నెక్స్ట్ అయితే ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన తాను నెక్స్ట్ మళ్ళీ తనదైన సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ లతో అదరగొట్టారు. లేటెస్ట్ గా అయితే “యశోద” సినిమాలో కూడా మణిశర్మ ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టు కూడా సాలిడ్ స్కోర్ అందించగా..

ఇప్పుడు అయితే ఆశ్చర్యకరంగా తాను తెలుగులో కేవలం ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నట్టుగా ఆలీ షో లో తెలిపారు. ఆలీతో సరదాగా షోలో ఆలీ ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు అంటే తెలుగులో “శాకుంతలం” అనే సినిమాకి ఒకటే చేస్తున్నానని ఇంకేం లేవని తెలిపారు.

అలాగే కన్నడలో ఓ సినిమా చేస్తున్నట్టు తెలిపారు. మరి సాలిడ్ కం బ్యాక్ ఇచ్చి ఇప్పుడుకీ కూడా తనదైన ఫ్రెష్ ట్యూన్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు ఇస్తున్న మణిశర్మ టాలీవుడ్ లో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఇప్పుడు చేస్తుండడం ఆశ్చర్యకరం. మరి మళ్ళీ చిరు లాంటి స్టార్స్ తో సరైన సినిమా ఏమన్నా పడుతుందేమో చూడాలి.