మన తెలుగు సహా తమిళ సినిమా మార్కెట్ లో మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ఉన్న హీరోయిన్స్ లానే అటు బాలీవుడ్ సినిమా దగ్గర కూడా కొంతమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. మరి అలాంటి స్టార్ హీరోయిన్స్ లో హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ఒకరు. కాగా కత్రినా అయితే మొదట పలు తెలుగు చిత్రాల్లో నటించి తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది.
ఇక ఇపుడు అక్కడే పలు భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న తాను గత కొన్నాళ్ల కితమే బాలీవుడ్ యంగ్ హీరో వికీ కౌశల్ ని పెళ్లి చేసుకుంది. అయితే ఇపుడు ఈ జంట హ్యాపీ గా తమ సినిమాలు, పర్శనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుండగా లేటెస్ట్ గా అయితే కత్రినా ప్రెగ్నెంట్ అయ్యినట్టుగా పలు రూమర్స్ బయటకి వచ్చాయి.
అయితే ఈ గాసిప్స్ అయితే కత్రినా క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాగా కత్రినా అయితే ఇపుడు తాను ప్రెగ్నెంట్ కాదు అని కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం తమ ఇద్దరం హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తున్నామని కానీ ఖచ్చితంగా బేబీ ని ప్లాన్ చేసుకుంటామని.
కాకపోతే ఇప్పుడు తనకి ఉన్న కమిట్మెంట్స్ ని సినిమాలు కంప్లీట్ చేసి అప్పుడు తాము ప్లానింగ్ చేసుకుంటామని తెలిపింది. దీనిపై ఆమెపై వస్తున్నా రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. కాగా ఇపుడు అయితే ఆమె నటించిన భారీ యాక్షన్ ప్రాజెక్ట్ “టైగర్ 3” రిలీజ్ కి రాబోతుంది.