వైరల్ : “సలార్” అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుంది..స్టార్ హీరో భార్య.!

పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్న హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ ఏక్షన్ డ్రామా చిత్రం “సలార్” కూడా ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అనేక అంచనాలు కూడా ఇప్పుడు నెలకొనగా హైదరాబాద్ లో ఈ చిత్రం ఇప్పుడు క్రేజీ ఏక్షన్ ఎపిసోడ్ షూట్ చేసుకుంటుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ స్పాట్ కి వెళ్లిన స్టార్ హీరో భార్య పెట్టిన పోస్ట్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. మరి ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా నటిస్తుండగా తన భార్య సుప్రియ మీనన్ సలార్ సెట్స్ కి షూటింగ్ చూడడానికి వెళ్లగా..

దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కాసేపు మాట్లాడే సమయం దొరకడం చాలా ఆనందంగా అనిపించింది అని లేటెస్ట్ పోస్ట్ ద్వారా తెలిపింది. అలాగే తాను చూసినంతవరకు అయితే ఈ చిత్రం అన్ని రికార్డులు ఇప్పుడు వరకు ఉన్నవి బద్దలు కొట్టేస్తుంది అని మెన్షన్ చెయ్యడం విశేషం.

దీనితో ఈ ఒక్క మాట దర్శకుడు ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ అభిమానుల్లో మరింత నమ్మకం తీసుకొచ్చేలా చేసింది. అలాగే నీల్ తన విజన్ ని సిల్వర్ స్క్రీన్ పై చూపించడం కూడా అద్భుతంగా ఉందని ఆమె చెప్పింది. దీనితో ఈమె పోస్ట్ ఒక్కసారిగా గట్టి వైరల్ గా మారింది.