ఈ చిన్న సినిమా చిరు ని అంత కదిలించిందా.!

ఇపుడు మారుతున్న కాలంలో చాలానే ట్రెండీ సినిమాలు అంటూ వచ్చేసాయి. కానీ మన తెలుగు నేల కి చెందిన విలువలను ఆకట్టుకునే విధంగా చూపిస్తున్న సినిమాలు గాని దర్శకులు గాని బాగా కరువయ్యారు. అలాగే ఒకవేళ తీసినా అన్నీ హిట్ అయ్యే పరిస్థితులు కూడా చాలా తక్కువ ఉన్నాయి.

అయితే గత వారం సినిమా థియేటర్స్ లోకి వచ్చిన ఓ చిన్ని సినిమా తెలుగు ఆడియెన్స్ ని ఎంత గానో కదిలిస్తుంది. ఆ సినిమానే “బలగం”. అద్భుతమైన ఎమోషన్స్ తో కుటుంబం కలిసి చూడదగ్గ సినిమాలా ఆశ్చర్యకరంగా కామెడీగా వేణు యెల్దండి దర్శకత్వం వహించి షాకిచ్చాడు.

మరి ఈ వర్క్ కి అయితే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఫిదా అవ్వడం విశేషం. తనకి ఏదైనా నచ్చితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విష్ చేసే చిరంజీవి ఈ సినిమా యూనిట్ ని పర్సనల్ గా కలిసి మరీ అభినందించడం అంటే తనకి ఈ సినిమా ఎంత నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.

వేణు ని దగ్గరకి తీసుకొని శాలువా కప్పి సన్మానించడం అయితే వేణు ని మరింత ఎమోషనల్ చేసేసింది. ఇంతేనా చిరు ఈ సినిమా కోసం వివరించి వారిని మెచ్చుకోవడం మరో విశేషం. కాగా ఈ కలయిక లో హీరో ప్రియదర్శి నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. దీనితో ఈ ఊహించని అంశం సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. కాగా రీసెంట్ గానే చిరు వాల్తేరు వీరయ్య అనే సినిమాతో సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే.