సుశాంత్ సింగ్ కేసు : ఈ ఒక్క కారణం చాలు రియాని అడ్డంగా ఇరికించడానికి!

Rhea chakraborty hasn't received cbi summons, say rhea lawyers

సుశాంత్ సింగ్ కేసు అంత‌కంత‌కు ఉత్కంఠ పెంచుతోంది. తాజాగా రియా చ‌క్ర‌వ‌ర్తి  వెన‌క మాఫియా విష‌య‌మై.. ఈ ఒక్క విష‌యంలో నిజాలు తెలిస్తే చాలు రియాని అడ్డంగా ఇరికించడానికి!

this one reason enough to know rheas hand in sushanth case
this one reason enough to know rheas hand in sushanth case

ఆమెను నిర్ధోషి అని నిరూపించేందుకు పోలీసులు.. లాయ‌ర్లు.. ఇండ‌స్ట్రీ పెద్ద‌లు అంతా ఏక‌మై గూడుపుటానీ న‌డిపిస్తుంటే నెటిజ‌నుల‌కు ర‌క‌ర‌కాల సందేహాలు క‌లుగుతున్నాయి. ఈ విష‌యంపై ఇప్ప‌టికే సుశాంత్ సింగ్ అభిమానులు స‌హా బాలీవుడ్ క్వీన్ కంగ‌న ర‌నౌత్ ప‌దే ప‌దే రియాను.. పోలీసుల్ని ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు. రియా వెన‌క ఒక‌ పెద్ద మ‌నిషి ఇవ‌న్నీ చేయిస్తున్నాడ‌ని త‌న‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తున్నాడ‌ని కంగ‌న ర‌నౌత్ బాలీవుడ్ మాఫియాని చెడుగుడు ఆడేస్తోంది. ఆయ‌న రియా మాజీ ల‌వ‌ర్ మ‌హేష్ భ‌ట్ అంటూ సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చారం హోరెత్తిపోతోంది.

మ‌రోవైపు రియా చ‌క్ర‌వ‌ర్తి  కేసు వాదిస్తున్న లాయ‌ర్ స‌తీష్ మ‌నేషిందే అస‌లు ఫీజు తీసుకోవ‌డం లేద‌ని రియాకు ఫేవ‌ర్ చేసేందుకు వెంప‌ర్లాడిపోతున్నాడ‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఎంత‌గా.. అంటే ఆయ‌నే నేరుగా మీడియా ముందుకు వ‌చ్చి.. అలాంటిదేమీ లేదు మొర్రో! అంటూ ఆవేద‌న చెందాడు. అంతేకాదు.. త‌న ఫీజు త‌న ఇష్ట‌మ‌ని అన్నాడు. రియా నుంచి ఫీజు తీసుకుంటున్నానా లేదా? అన్న‌ది పూర్తిగా త‌న వ్య‌క్తిగ‌త విష‌య‌మేనంటూ త‌ప్పించుకోజూశాడు.

మొత్తానికి రియాను ఈ కేసులో గెలిపించేందుకు తెర‌వెన‌క బిగ్ షాట్స్ ప‌ని చేస్తున్నార‌న్న సందేహాన్ని నేరుగా లాయ‌రే రాజేసిన‌ట్ట‌య్యింది. నిన్న సీబీఐ విచార‌ణ అనంత‌రం రియా నేరుగా ముంబై శాంతా క్ర‌జ్ పోలీస్ స్టేష‌న్ కి వెళ్ల‌డంతో ముంబై పోలీసులు కూడా గూడుపుటానీలో ఉన్నారా? అంటూ సోష‌ల్ మీడియాలో పంచ్ లు ప‌డిపోతున్నాయి. పోలీసులు.. లాయ‌ర్ల‌.. పెద్ద మ‌నుషులు తెర‌వెన‌క ఉండి అంతా న‌డిపిస్తున్నార‌న్న సందేహాలు అంత‌కంత‌కు రైజ్ అవుతున్నాయి. దీనిపై సీబీఐ లోతుగా ద‌ర్యాప్తు చేస్తోంది.