వైరల్ : మొదటి 2 సినిమాలు 2 నేషనల్ అవార్డ్స్ తో మెగా హీరో 

Vaishnav-Tej-696x428

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ ఫామిలీ లో అయితే మెగా కుటుంబం కూడా ఒకటి. మరి ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో వెన్నంటే ఉన్న అభిమానుల మీద నమ్మకంతో మెగా కుటుంబం నుంచి వచ్చిన మెగా హీరోస్ లో అయితే చాలా మంది మంచి సక్సెస్ అందుకున్నారు.

కానీ ఒక్క మెగా హీరో మాత్రం ఏ హీరోకి అందుకోని మెగా లక్ ని అయితే అందుకున్నాడని చెప్పొచ్చు. ఆ యంగ్ హీరో ఎవరో కాదు వైష్ణవ్ తేజ్ అనే చెప్పాలి. కాగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం “ఉప్పెన” తో టాలీవుడ్ లోనే కాదు ఏకంగా ఇండియన్ సినిమా దగ్గరే ఏ డెబ్యూ హీరో అందుకోని భారీ సక్సెస్ 100 కోట్ల గ్రాస్ ని అందుకున్నాడు.

ఇదే ఒకెత్తు అయితే లేటెస్ట్ గా ఈ చిత్రానికి జాతీయ అవార్డు రావడం ఒకటి కాగా దీనితో పాటుగా తన రెండో సినిమా అయినటువంటి “కొండపొలం” చిత్రం నుంచి కూడా ఓ సాంగ్ కి నేషనల్ అవార్డు రావడం మరో ఇంట్రెస్టింగ్ అంశం అని చెప్పాలి. అయితే ఇలా మొదటి రెండు సినిమాలు తోనే రెండు నేషనల్ అవార్డ్స్ ఉన్న ఏకైక హీరోగా అయితే మన టాలీవుడ్ లో వైష్ణవ్ తేజ్ ఒకడే నిలిచినట్టు ఉన్నాడని అంతా అంటున్నారు.

దీనితో వైష్ణవ్ మాత్రం ఈ విషయంలో చాలా లక్కీ అని అంతా అంటున్నారు. మొత్తానికి అయితే ఈ ఒక్క మెగా యంగ్ హీరోకి మాత్రం ఈ రకంగా కుదిరేసింది మరి. కాగా ఇప్పుడు అయితే వైష్ణవ్ “ఆదికేశవ” అనే చిత్రంతో రాబోతున్నాడు.