ఇన్సైడ్ బజ్ : అప్పుడే “ఆదికేశవ” ఓటిటి డేట్ ఖరారు??

టాలీవుడ్ సినిమా దగ్గర ఎంట్రీ ఇస్తూనే ఓ సెన్సేషనల్ హిట్ ని అందుకున్న యంగ్ హీరోస్ లో రీసెంట్ మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ కూడా ఒకడు. మరి ఉప్పెన తర్వాత మళ్ళీ ఓ హిట్ ని అందుకునేందుకు బాగా స్ట్రగుల్ అవుతున్న వైష్ణవ్ లేటెస్ట్ గా మాస్ చిత్రం “ఆదికేశవ” రిలీజ్ తో అయితే వచ్చాడు.

కానీ ఈ సినిమా షాకింగ్ గా డిజాస్టర్ రిపోర్ట్స్ అందుకుంది. దీనితో ఆదికేశవ సినిమా తన కెరీర్ లో మరో ప్లాప్ గా నిలిచిపోయింది. హీరోయిన్ శ్రీలీల ఉన్నప్పటికీ ఆమె ఫెవర్ కూడా సినిమాకి పనికిరాలేదు. మెయిన్ గా డైరెక్టర్ విఫలం కావడంతో ఈ సినిమా రెండో రోజు నుంచే స్లో అయ్యిపోయింది.

ఇక ఇదిలా ఉండగా కొన్ని ట్రస్టడ్ సోర్సెస్ తో అప్పుడే ఈ సినిమా ఓటిటి విడుదల కూడా ఖరారు అయినట్టుగా తెలుస్తుంది. కాగా ఈ సినిమా ఓటిటి హక్కులని ప్రముఖ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మరి ఇందులో ఈ సినిమా జస్ట్ నెల వ్యవధిలో అంటే ఈ డిసెంబర్ 25 లోపే వచ్చేస్తోంది అని అంటున్నారు.

దీనితో డిసెంబర్ 22 తర్వాత ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేయవచ్చు. ఇంకా ఈ సినిమాని దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కించగా ఈ సినిమా చూసాక అతని మీద విమర్శలు వచ్చాయి. క్లాజ్ చాలా సినిమాలు తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ త్రివిక్రమ్ నిర్మాణ సంస్థకి ఓ డిజాస్టర్ పడింది.