ఇంత మాస్ యువ మెగా హీరోకి వర్కౌట్ అయితే..

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న అతి పెద్ద కుటుంబాల బ్యాక్గ్రౌండ్స్ లో మెగా ఫామిలీ కూడా ఒకటి. మరి ఎప్పటికప్పుడు మెగా కాంపౌండ్ నుంచి యంగ్ హీరోస్ టాలీవుడ్ కి పరిచయం అవుతుండగా వారిలో కొందరు సక్సెస్ అయిన వారు ఉన్నారు కొందరు స్ట్రగుల్ అవుతున్న వారు కూడా ఉన్నారు.

మరి అలా వచ్చి మొదటి సినిమాతోనే 100 కోట్ల గ్రాస్ ఇచ్చిన ఏకైక ఇండియన్ అండ్ మెగా హీరోగా వైష్ణవ్ తేజ్ అయితే నిలిచాడు. ఈ యంగ్ హీరో డెబ్యూ ఓ సంచలనం కాగా మళ్ళీ ఆ తర్వాత నుంచి మంచి హిట్ అందుకోడానికి అయితే తాను ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నాడు.

కాగా ఇప్పుడు తాను చేసిన ఇంట్రెస్టింగ్ మాస్ చిత్రమే ఆదికేశవ కాగా దీనిని దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించాడు. అలాగే శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఇది ఊహించని మాస్ గా ఉందని చెప్పాలి. మెయిన్ గా వైష్ణవ్ లో మాస్ హీరో లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

దీనితో మెగా కాంపౌండ్ నుంచి సరిగ్గా వాడుకుంటే ఈ యువ హీరో కూడా మంచి మాస్ హీరోగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఫుల్ లెంగ్త్ సినిమాలో చూసేది కూడా వేరే ఉంటుంది. మరి సినిమాలో కూడా ట్రైలర్ రేంజ్ లో అనిపిస్తే వైష్ణవ్ మాస్ హీరోగా తన అన్న సాయి ధరమ్ తేజ్ ని మించినా ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రం ఈ నవంబర్ 24న అయితే గ్రాండ్ గా విడుదల కాబోతుంది. 
Aadikeshava Theatrical Trailer | Panja Vaisshnav Tej, Sreeleela | Srikanth Reddy | GV Prakash