Niharika: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించిన నిహారిక ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు.ఇలా హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో ఈమె జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.వివాహం అనంతరం ఎలాంటి సినిమాలలోనూ నటించకపోయినా వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మారారు. ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నిహారిక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా ఈ మెసేజ్ చేస్తే పోస్టులకు నెటిజన్ల నుంచి దారుణంగా ట్రోలింగ్ ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ని డిలీట్ చేసిన నిహారిక గత రెండు నెలల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.ఇలా ఇంస్టాగ్రామ్ డిలీట్ చేయడంతో పెద్ద ఎత్తున ఈమె గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేశాయి. ఇలా సోషల్ మీడియాలో నిహారిక గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈమె పబ్ లో పోలీసులకు అడ్డంగా దొరకడంతో ఈమె వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
పబ్ వ్యవహారం తర్వాత నిహారిక పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఎక్కడ సోషల్ మీడియాలో కనిపించకపోవడంతో ఈమె పై మెగా కుటుంబం ఆంక్షలు విధించింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. నిహారిక గురించి ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్న తరుణంలో ఈమె సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. గత రెండు నెలల్లో ఎన్నో గుణ పాఠాలు నేర్చుకున్నాను, ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు, ఇతరులు ఏం చేస్తున్నారు అనే విషయం గురించి పట్టించుకోను అంటూ ఇన్ స్టా పోస్ట్ చేశారు. ప్రస్తుతం నిహారిక చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.