ఈ రాబోతున్న డిసెంబర్ నెలలో అయితే మళ్ళీ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయ్యే పలు భారీ చిత్రాలు రాబోతున్నాయని చెప్పాలి. మరి మొదటి రోజే బాలీవుడ్ చిత్రం ఆనిమల్ విడుదల కాబోతుండగా నెక్స్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ అలాగే బాలీవుడ్ కింగ్ ఖండ్ షారుఖ్ ఖాన్ చిత్రాలు కూడా ఉన్నాయి.
మరి షారుఖ్ ఖాన్ అయితే వరుసగా రెండు భారీ హిట్స్ అందుకుని ఫుల్ ఊపులో ఉండగా తన మూడో చిత్రం డంకి తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఇదే రేస్ లో ఉన్న ప్రభాస్ రెండో చిత్రం సలార్ పై కూడా హైప్ మాములుగా లేదు. దీంతో ఈ డిసెంబర్ మాత్రం ఇండియన్ సినిమా దగ్గర ఓ బిగ్గెస్ట్ ముగింపు అని చెప్పొచ్చు.
అయితే ఇప్పుడు సలార్ విషయంలో ఒకొకటిగా కొన్ని ఆసక్తికర వార్తలు బయటకి వస్తున్నాయి. వాటిలో దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా కథ ఏంటి అనేది రివీల్ చేసేసాడు. ఇది వరకే ఇది ఇద్దరు స్నేహితుల మధ్య కథ అని అందరికీ తెలిసిందే. మరి ఇదే కోణం ని ప్రశాంత్ నీల్ కన్ఫర్మ్ చేసాడు.
ఇద్దరు ప్రాణ స్నేహితులు విరోధులుగా మారితే ఎలా ఉంటుంది వారి సామ్రాజాల్లో ఏం చేశారు అనేదే అసలు కథ అని నీల్ రివీల్ చేసేసాడు. అలాగే ఇది రెండు భాగాలుగా ప్లాన్ చేసాడు. దీనితో సలార్ పై అందరికీ ఓ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రేయ రెడ్డి, పృథ్వీ రాజ్ సుకుమారన్ అలాగే జగపతిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ 22న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది.