ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ చేయకపోవడానికి అసలు కారణం ఇదే: తమన్

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని ప్రస్తుతం చేతిలో పది సినిమాలను పెట్టుకొని ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో ఎస్.ఎస్.తమన్ ఒకరు. ఈయన ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా, పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్, మహేష్ బాబు సర్కారీ వారి పాట వంటి వివిధ చిత్రాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నట్టువంటి తమన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తమన్ ఇంటర్వ్యూలో పాల్గొనగా అతనికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరికీ మ్యూజిక్ అందించిన తమన్ ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ అందించకపోవడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న ఎదురయింది. ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనతో ప్రభాస్ హీరోగా నటించిన రెబల్ సినిమాకు సంగీతం అందించే అవకాశం వచ్చింది.

అయితే ఆ సమయంలో లారెన్స్ సంగీతం అందిస్తానని చెప్పడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాను. అయితే అప్పటి నుంచి పలు చిత్రాల కారణంగా బిజీగా ఉండడంతో ప్రభాస్ నటిస్తున్నటువంటి సినిమాలకు మ్యూజిక్ అందించే అవకాశం రాలేదని ఫ్యూచర్ లో తప్పకుండా ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ అందిస్తానని ఈ సందర్భంగా తమన్ తెలిపారు.