ఓం రౌత్ దర్శకత్వం వహించిన పౌరాణిక పురాణ చిత్రం ఆదిపురుష్. జూన్ 16న థియేటర్లలో విడుదలైంది. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ చిత్రం.. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ… బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం రూ.240 కోట్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమా విడుదల అయినప్పటి నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, డైలాగ్స్ పై చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాపై విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ఇక సినిమా గ్రాఫిక్స్ మీద విమర్శలు కొనసాగుతూనే ఉంది. పాత్రలు చూపించిన విధానం సరిగాలేదని పలువురు మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి సారిగా దర్శకుడు ఓం రౌత్ స్పందించాడు. తన ట్విట్టర్ ఖాతా నుంచి ఓ పోస్ట్ పెట్టాడు. ఆది పురుష్ ప్రదర్శితమవుతున్న థియేటర్లలో హనుమంతుడి కోసం వదిలిపెట్టిన సీట్ల ఫోటోలను ట్వీట్ చేశాడు. జై శ్రీరామ్ అంటూ దేశంలోని అన్ని థియేటర్లు భక్తితో నిండిపోయాయని తెలిపాడు. ఆదిపురుష్ కథపై వస్తున్న విమర్శలకు ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
ఇక ఈ సినిమాపై ట్రోలింగ్ మాత్రం ఆగట్లేదు. కొందరు నెటిజన్స్ ఏకంగా ఇదీ.. ఓం రౌత్ రామాయణం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో రామాయణంలో వున్న కథని వక్రీకరించి ఓం రౌత్ తనకి నచ్చిన కథని పెట్టుకున్నాడని విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలోని సీన్స్ కూడా హలీవుడ్ చిత్రాల్లోని సీన్స్ ను పోలీ ఉన్నాయని అంటున్నారు.
ఇక ఈ చిత్రంలోని పాత్రల ఆహార్యం, డైలాగుల మీద విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రావణుడి గెటప్ మీద ట్రోలింగ్స్ వస్తున్నాయి. అటు హనుమంతుడి డైలాగ్స్ మీద కూడా ట్రోల్స్ రాగా.. చిత్ర బృందం స్పందించింది. కొన్ని డైలాగ్స్ మార్చి మళ్లీ విడుదల చేస్తామని తాజాగా ప్రకటించింది. ఇక ఈ సినిమాను 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో టి సిరీస్, రెట్రో ఫైల్స్ నిర్మించాయి.