Bigg boss 4: సొహెల్ కు నిజంగానే కోపం ఎక్కువ.. ఇదిగో ప్రూఫ్?

This is bigg boss contestant sohel actual behaviour

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సోహెల్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఎందుకంటే.. ఎటువంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన సోహెల్.. ప్రస్తుతం కెప్టెన్ అవడమే కాకుండా.. 8 మంది నామినేషన్ లిస్టులో ముందు సేవ్ అయ్యాడు. అంటే.. బిగ్ బాస్ హౌస్ లో సొహెల్ రోజురోజుకూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతున్నాడన్నమాట.

This is bigg boss contestant sohel actual behaviour
This is bigg boss contestant sohel actual behaviour

సోహెల్ ఆటను బిగ్ బాస్ తో పాటు హోస్ట్ నాగార్జున కూడా మెచ్చుకుంటున్నాడు. కానీ.. సోహెల్  చేస్తున్న ఒకే ఒక మిస్టేక్. కోపం. సోహెల్ కు కోపమొస్తే.. తన మెడ మీద ఉన్న నరాలు ఒక్కసారిగా ఉప్పొంగుతాయి. ఆ సమయంలో సొహెల్ ఏం చేస్తాడో తనకే తెలియదు. అదే ఆయన్ను బిగ్ బాస్ హౌస్ లో వెనక్కి లాగుతోంది.

అయితే.. సొహెల్ కావాలని బిగ్ బాస్ హౌస్ లో అలా కోప్పడుతున్నాడా? లేక సేఫ్ గేమ్ ఆడుదామనుకుంటున్నాడా? అంటే అస్సలు కాదు. ఆయనకు స్వతహాగానే కోపం ఎక్కువ. బయట కూడా ఆయన బిహేవియర్ అలాగే ఉంటది అని చెప్పడానికి ఓ ప్రూఫ్ దొరికింది.

అంటే.. సొహెల్ బిగ్ బాస్ హౌస్ లో ఫేక్ గా లేడు. కావాలని కోపగించుకోవడం లేదు.. కావాలని సేఫ్ గేమ్ ఆడటం లేదు. తను బయట ఎలా ఉన్నాడో? హౌస్ లోనూ అలాగే ఉన్నాడు.. అని చెప్పడానికి ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.

ఓ యూట్యూబ్ చానెల్ వాళ్లు సొహెల్ మీద ప్రాంక్ వీడియో చేస్తాడు. ఆ వీడియోలో సొహెల్ ను వాళ్లు తెగ సతాయించేసరికి.. వాళ్లను కొట్టడానికి కూడా సొహెల్ వెనుకాడటం లేదు. సేమ్.. బిగ్ బాస్ హౌస్ లో ఎలా సొహెల్ కు కోపం వచ్చిందో.. వాళ్ల ముందు కూడా అదే కోపం.. అలాగే మెడ మీది నరాలు ఉప్పొంగడం.. ఇంకా వర్ణించడం ఎందుకు.. మీరే ఆ వీడియో చూస్తేనే పోలా…

Prank On Bigg Boss Contestant Actor Sohel Ryan || Funny Pranks in Telugu || Mana Dunia