ప్రస్తుతం గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న నటించనున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసిన భారీ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. మరి ఈ భారీ సినిమా షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ కానుండగా ఈ సినిమా అయితే కోలీవుడ్ సినిమా తేరి కి రీమేక్ గా తెరకెక్కనుంది అని టాక్ ఉంది.
కాగా ఈ మధ్య వచ్చిన కొన్ని రూమర్స్ ని అయితే దర్శకుడు హరీష్ శంకర్ ఖండించగా దానితో పాటుగా సినిమా హీరోయిన్ కి సంబంధించి కూడా పలు ఊహించని మార్పులు చేర్పులు వచ్చినట్టుగా కూడా టాక్ వచ్చింది. మొదటగా భవదీయుడు భగత్ సింగ్ కి లాక్ చేసుకున్న హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో కంటిన్యూ అవుతుంది అని కానీ తర్వాత ఆమెని యంగ్ హీరోయిన్ శ్రీ లీల రీప్లేస్ చేసినట్టుగా టాక్ వచ్చింది.
ఇక తర్వాత అయితే ఈ ఇద్దరూ ఉన్నారు అంటూ రూమర్స్ వచ్చాయి. కానీ లేటెస్ట్ గా అయితే కొన్ని ట్రస్టడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కోలీవుడ్ గ్లామరస్ హాట్ బ్యూటీ “మాస్టర్” ఫేమ్ మాళవిక మోహనన్ కన్ఫర్మ్ అయ్యినట్టుగా తెలుస్తుంది.
దీనితో ఫైనల్ గా ఈమె కన్ఫర్మ్ అయ్యిందని లేటెస్ట్ గాసిప్. మరి ఈమె పూజా హెగ్డే ని రీప్లేస్ చేసినట్టుగా వినిపిస్తుంది. కాగా దీనిపై త్వరలోనే అధికారిక అప్డేట్ రానుంది. ఇంకా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.