లేటెస్ట్ : “వీరమల్లు” లో ఇప్పుడు తీస్తున్న సీన్ అదిరిపోతుందట.!

harihara veeramallu

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు ఓకే చేయగా వాటిలో ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న భారీ చిత్రం మాత్రం “హరిహర వీరమల్లు”. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పవన్ కూడా గత సినిమాల్లా కాకుండా చాలా శ్రద్ధ గానే చేస్తున్నాడు.

వర్క్ షాప్స్ అని ప్రాక్టీస్ అని మేకర్స్ ఎప్పటికప్పుడు క్రేజీ హైప్ కూడా ఎక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా లేటెస్ట్ షూటింగ్ మొన్ననే జరగాల్సి ఉండగా టాలీవుడ్ లో నెలకొన్న విషాదంతో పవన్ ఆపేసాడు. కానీ ఇపుడు మళ్ళీ పవన్ ఈ షూటింగ్ ని స్టార్ట్ చేసినట్టుగా సినీ వర్గాలు లేటెస్ట్ గా ఇచ్చిన సమాచారం.

దీనితో అయితే పవర్ స్టార్ పై దర్శకుడు ఓ బ్రెత్ టేకింగ్ క్రేజీ సీన్ ని ప్లాన్ చేసాడట. మరి ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ సన్నివేశాన్ని దర్శకుడు తీస్తుండగా పవన్ గడ్డం లుక్ లోనే అదిరిపోయే సీన్స్ ని ఇప్పుడు తీస్తున్నారట.

దీనితో అయితే ఈ పర్టిక్యుకర్ ఇంటర్వెల్ ఏక్షన్ సీన్ సినిమాలోనే పెద్ద హైలైట్ గా నిలుస్తుందని సినీ వర్గాలు వారు అంటున్నారు. పవన్ ని గడ్డం సినిమా గెటప్ లో విశ్వరూపం చూపిస్తాడని అంటున్నారు. మరి క్రిష్ అయితే ఈ సీన్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాల్సిందే.