Director Teja: మెడపట్టి బయటకు పంపారు.. మళ్లీ తేజ వచ్చి బతిమాలితే సినిమా చేశా: డైరెక్టర్ తేజ

Director Teja: తేజ గారు అప్పట్లో ఆడిషన్స్ కోసం పేపర్లో కూడా ప్రకటన ఇచ్చే వారని, అది చూసి తాను ఫొటోలు పంపిస్తే, పంపిన 10మందిలో 9మందిని పిలిచేవారు గానీ, తనను మాత్రం పిలవకపోయేవారని నటుడు MS. చౌదరి అన్నారు. అలా తేజ గారి దగ్గరే కాదు ఏ ఆఫీస్‌కి పంపినా కూడా అలానే జరిగేదని ఆయన వాపోయారు. తేజ గారి నిజం సినిమాకు కూడా అలానే జరిగిందని, అప్పటికీ యాక్టింగ్ అంటే ఫ్యాషన్, పిచ్చి తనకు అవకాశం వస్తుందని ఎదురుచూస్తుంటే, అలా పిలవకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యేవాడినని ఆయన చెప్పారు.

అయితే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఓ వ్యక్తి తనకు పరిచయం అయ్యారని, తనను ఆడిషన్‌కు పంపిస్తాడన్న ఆశతో అతనికి రోజూ మందు ఇప్పించి, హోటల్‌లో భోజనం తెప్పించి కాకా పట్టేవాడినని ఆయన చెప్పారు. అలా నెల రోజుల పాటు సాగిన తర్వాత ఓ రోజు ఆ వ్యక్తి అన్నాడు.. నేను చెప్పాను.. రేపు పొద్దున వచ్చేయ్ ఆడిషన్‌కి అని చెప్పగానే తాను వెళ్లానని ఆయన చెప్పుకొచ్చారు. ఆ గేట్‌ దగ్గర తనతో పాటు ఇంకో వ్యక్తి ఉంటాడని తనకు అతను ముందే చెప్పాడని, కానీ తన పక్కనున్న అతన్ని మాత్రమే పిలిచారని, తనను పిలవలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేంటీ సర్ ఇద్దర్నీ అని చెప్పారు కదా అని తాను అడిగితే, లేదు మాకు ఒక్కరనే చెప్పారని వాళ్లు చెప్పినట్టు ఆయన తెలిపారు. తాను చెప్పేది కూడా వినకుండా అక్కడ ఉంటే వ్యక్తి తనను మెడపట్టి బయటకు నెట్టేశాడని ఆయన అన్నారు. అప్పటికీ తనకు కళ్ల వెంట నీళ్లు వచ్చేశాయని ఆయన వాపోయారు.

అలా తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని చౌదరి తెలిపారు. అలా సినిమా మీద పిచ్చితో ఇండస్ట్రీకి వచ్చే వాళ్లు చాలా మంది ఉన్నారని, ఆ సంఘటనతో తాను చాలా బాధపడ్డానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అది జరిగిన తర్వాత ఏ డైరెక్టర్ అయితే వద్దన్నారో, ఆయనే తేజ గారు వచ్చి, తనను ఓ సినిమాలో కచ్చితంగా చేయాల్సిందేనని బతిమిలాడితే చేశానని ఆయన గర్వంగా చెప్పారు. నిజంగా మనకు టాలెంట్ ఉంటే కచ్చితంగా అవకాశం వస్తుందన్న ఆయన, అలాంటి వాళ్లకు తప్పకుండా ఛాన్స్ వస్తుందని చౌదరి స్పష్టం చేశారు.