ప్రభాస్ అలా చేస్తుండడం వాళ్లకు నచ్చడం లేదు: కృష్ణంరాజు

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పెద నాన్న, ఒకప్పటి రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి అందరికి తెలిసిందే. ఇక ఈయన ప్రభాస్ నటించిన సినిమాలలో కూడా నటించాడు. అలా ఇటీవలె విడుదలైన రాధేశ్యామ్ సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో తెగ సందడి చేసింది.

దీంతో తాజాగా కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమాలో తన పాత్ర పేరు పరమహంస అని.. ఆ పాత్రలో ప్రభాస్ తనను దేవుడిగా చూసినట్టుగా ఉందని అన్నాడని తెలిపాడు. ఇక ఒక్క విషయంలో ప్రభాస్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నారని.. ప్రభాస్ రెండుమూడేళ్లకు ఒక సినిమా చేస్తుండడం వాళ్లకు నచ్చట్లేదని అన్నాడు. ఇకపై సంవత్సరానికి రెండు సినిమాలను చెయ్యాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడని అన్నాడు.