మనం కష్టంలో ఉన్నప్పుడే మన అనుకునే వాళ్ళు ఎవరో మనకి తెలుస్తుంది. మన సక్సెస్ ని షేర్ చేసుకోవడానికి మనతోపాటు ఎంజాయ్ చేయడానికి మనతో చాలామంది ఉంటారు కానీ మనకి కష్టం వస్తే కనీసం కనిపించడానికి కూడా ఇష్టపడరు. స్టార్ట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయంలో అదే జరిగింది అతను అంత పెద్ద కష్టం లో ఉన్నప్పుడు తోడుగా ఆయన భార్య మాత్రమే ఆయనకి తోడునీడగా నిలబడ్డారు.
కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు.జనసేన పార్టీలో కీలకనేతగా ఉన్న జానీ మాస్టర్ గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం బాగా కష్టపడ్డారు. అయితే ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి షాకిచ్చారు.16-9-24 న పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్‌ని జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది జనసేన పార్టీ. అలాగే జానీ మాస్టర్ దేవుడిగా భావించే రాంచరణ్ కూడా ఆయనకి అండగా నిలబడలేదనే చెప్పాలి.
అయితే బయటికి వచ్చిన తర్వాత మొదటిసారి జానీ మాస్టర్ దంపతులు జర్నలిస్ట్ జాఫర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలని షేర్ చేసుకున్నారు. జానీ మాస్టర్ పై విషయం పై స్పందిస్తూ నాకుగా నేను సమస్య నుంచి బయట పడాలని వారు ఆగారు తప్ప మరేం కాదు, నా మనసులో వారిపై ప్రేమ చచ్చేంత వరకు అలాగే ఉంటుంది అని చెప్తూ ఎమోషనల్ అయిపోయాడు. అలాగే జానీ మాస్టర్ భార్య సుమలత మాట్లాడుతూ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన విషయం పిల్లలకు చెప్పలేదు.
షూటింగ్ లో ఉన్నారని చెప్పాను. ఎవరైనా మా పిల్లల్ని మీ డాడీ ఎక్కడ అని అడిగితే షూటింగ్ కి వెళ్ళాడు అని చెప్పేవాళ్ళు. పిల్లలని జైలుకు తీసుకెళ్లలేదు. ఆయన జైలులో ఉన్నన్ని రోజులు వాళ్లకు స్కూల్, ఇల్లు అంతే. ఆ సమయంలో నాకు నా పిల్లలు అలియా, సిరాజ్ సపోర్ట్ ఇచ్చారు. నేను ఒక్కదాన్నే కూర్చొని రూమ్ లో ఏడుస్తుంటే వచ్చి నువ్ అలా ఉంటే నాకు ఏడుపొస్తుంది, డాడీ షూటింగ్ నుంచి వచ్చేస్తారు అని హగ్ చేసుకొని సపోర్ట్ చేశారు. కనీసం డాడీకి కాల్ చెయ్యి, వీడియో కాల్ చెయ్ అని కూడా అడగలేదు. అంటూ ఎమోషనల్ అయింది.