Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన ఈయన నిర్మాతగా మారి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేసే స్థాయికి ఎదిగారు. ఇక త్వరలోనే దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ ఛేంజర్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా జనవరి 10వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ నిజానికి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలోనే సినిమా గురించి ఎన్నో విషయాలను చెప్పాలనుకున్నాను కాకపోతే అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసుల త్వరగా ముగించేయాలని చెప్పిన నేపథ్యంలోనే మా ప్రసంగాన్ని ముగించేయాల్సి వచ్చిందని దిల్ రాజు తెలిపారు.
ఈ సినిమా నాకు శంకర్ రామ్ చరణ్ ముగ్గురికి చాలా కీలకమని తెలిపారు. శంకర్ గారు ఎంతో గొప్ప అనుభవం ఉన్న దర్శకుడు అయినప్పటికీ నేను పదేపదే ఆయనకు సినిమా మంచిగా రావాలని చెప్పాను ఆయన కూడా ఇది నాకు కం బ్యాక్ సినిమా అవుతుందని చెప్పారు. ఇక సినిమా మొత్తం పూర్తి అయిన తర్వాత అవుట్ ఫుట్ మరో లెవెల్ లో వచ్చిందని దిల్ రాజు తెలిపారు.
ఇక ఈ మీడియా సమావేశంలో భాగంగా రిపోర్టర్ ఈయనని ప్రశ్నిస్తూ జనసేన పార్టీకి మీరు ఇంధనంలా మారారు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు కదా మీ స్పందన ఏంటి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు దిల్ రాజు సమాధానం చెబుతూ ఆయన చెప్పే వరకు నేను జనసేన పార్టీ కోసం అంతగా సహాయం చేశానని నాకు కూడా తెలియదు అంటూ దిల్ రాజు తెలిపారు.
నిర్మాతగా ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాలని అనుకున్నాను. అది అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారు సినిమా అయ్యిందని తెలిపారు ఆయన ఆ మాటలు చెప్పగానే నాకు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయని దిల్ రాజు తెలిపారు. ఎవరూ కూడా అలాంటి ఒక పబ్లిక్ వేదికపై అది కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అలా మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడారు అంటే అది ఆయన గొప్పతనం అని ఆయన మంచితనానికి పాదాభివందనం చేసిన తప్పులేదు అంటూ దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.