చంపేస్తామని బెదిరిస్తున్నారు.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కంగనా?

బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా కాంట్రవర్సికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఈమె ఎక్కడ ఉంటే అక్కడ పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతుంటాయి.ఇలా కంగనా రనౌత్ కేవలం సినిమా విషయాల గురించి మాత్రమే కాకుండా సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా కంగనా రనౌత్ గురించి సోషల్ మీడియాలో ఏకంగా తనని చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కంగనా రౌనత్ సోషల్ మీడియా వేదికగా చేసే వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారం రేపడంతో ఈమెను సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తుంటారు. అయితే కంగనా కూడా ఈ ట్రోలింగ్ పై గట్టిగా స్పందిస్తూ కౌంటర్ వేస్తుంటారు.ఇకపోతే తాజాగా రైతుల సాగు చట్టాల గురించి పెద్ద ఎత్తున రైతులు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సాగు చట్టాల గురించి ఈమె రైతులకు వ్యతిరేకంగా మాట్లాడటంతో పెద్ద ఎత్తున రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక పంజాబ్ కి చెందిన రైతు ఏకంగా తనని చంపేస్తామని బెదిరిస్తున్నారని కంగనా పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని చెప్పిన కంగనా తన పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే విధంగా తన గురించి ఈ విధంగా బెదిరించే వారి పట్ల చర్యలు తీసుకోవాలని సోనియాగాంధీకి వెల్లడించారు.గతంలో తన అత్త ఇందిరాగాంధీ కూడా ఉగ్రవాదులపై ఆఖరి వరకు పోరాడారని గుర్తు చేశారు.