గాసిప్స్ : ప్రభాస్ కోసం ఇద్దరు హాట్ బాంబ్స్??

ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు లోకల్ టు నాన్ లోకల్ వరల్డ్ వైడ్ చిత్రాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాల్లో అన్నిటికి కన్నా కాస్త లో ప్రొఫైల్ లో ఉన్న చిత్రం మాత్రం దర్శకుడు మారుతితో చేస్తుంది అని చెప్పాలి.

కాగా సర్ప్రైజింగ్ గా ఈ చిత్రంలోనే చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని సినీ వర్గాల్లో మంచి టాక్ కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి ప్రభాస్ ఫ్యాన్స్ లో కూడా అంత బజ్ లేని ఈ చిత్రం మాత్రం సైలెంట్ గా కంప్లీట్ అవుతుంది. దర్శకుడు మారుతీ వింటేజ్ ప్రభాస్ లా ప్రెజెంట్ చేస్తూ ఓ ఫాంటసీ కం హారర్ కామెడీని ట్రై చేస్తున్నాడు.

మరి ఈ చిత్రంలో ఇప్పుడు ఓ క్రేజీ ఐటెం సాంగ్ ని ప్లే చేస్తుండగా ఈ సాంగ్ కోసం ఇప్పుడు సినీ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఓ సందర్భానికి గాను క్రేజీ ఐటెం నెంబర్ ఉండగా ఈ సాంగ్ కోసం ఇద్డు బాలీవుడ్ స్టార్ అండ్ హాట్ బ్యూటీస్ పరిశీలనలో ఉన్నట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా వారు అయితే హాట్ సెన్సేషన్ నోరా ఫతేహి మరియు మరో హ్యాపెనింగ్ బ్యూటీ జాన్వీ కపూర్ అట. మరి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేసి సినిమాకి లాక్ చేస్తారు అని తెలుస్తుంది. మొత్తానికి అయితే మంచి ప్లానింగ్స్ ఈ చిత్రానికి నడుస్తున్నాయి అని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరికొందరు హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని  ఫ్యాక్టరీ వారు నిర్యాణం వహిస్తున్నారు.