ఇన్సైడ్ బజ్ : “బ్రో” ప్రీరిలీజ్ కి ఇంతమంది హీరోస్.?

ప్రస్తుతం టాలీవుడ్ లో రాబోతున్న ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే  సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లు నటించిన ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ చిత్రం “బ్రో ది అవతార్” కోసం తెలిసిందే.

దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఈరోజు అవైటెడ్ టీజర్ ని రిలీజ్ చేస్తుండగా దీని కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా అయితే ఇవాళ ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ కి నెల రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఈ గ్యాప్ లో జరగాల్సిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అయితే సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి వినిపిస్తుంది.

కాగా ఈ సమాచారం ప్రకారం “బ్రో” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా హీరోస్ అందరు ఆల్ మోస్ట్ హాజరు అవుతారు అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అందరు అంటే చిన్న హీరోస్ కాకుండా మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సహా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వస్తాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

దీనితో ఈ టాక్ మెగా వర్గాల నుంచి బయటకి రాగ ఆసక్తిగా మారింది. మరి ఇది కనుక నిజం అయితే మెగాఫ్యాన్స్ కి భారీ ట్రీట్ ఖాయం అని చెప్పాలి. అయితే ఈ చిత్రం ఈవెంట్ తో పవన్ కి పొలిటికల్ గా కూడా వారంతా సపోర్ట్ గా ఉండడానికి మద్దతు ఇస్తారని కూడా అంటున్నారు. కాకపోతే ఇన్ డైరెక్ట్ గా అన్నట్టుగా టాక్.