చిన్న వయసులోనే మృత్యు ఒడిలో చేరిన తెలుగు హాస్య నటీనటులు వీళ్ళే..

తెలుగు చిత్ర పరిశ్రమలో తమ హాస్యంతో నవ్వులు పూయించి ప్రేక్షకులను అలరించే గొప్ప పేరున్న నటీనటులు తక్కువ వయసులోనే చనిపోయిన వారు చాలానే ఉన్నారు. మన నవ్వుల రారాజులుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. వారు ఎవరో మనం ఇప్పుడు చూద్దాం.

కొండవలస. చిత్ర పరిశ్రమలో పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎందుకంటే కబడ్డీ కబడ్డీ, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. వంటి మంచి మంచి సినిమాలలో నటించి తన హాస్యంతో ప్రేక్షకులను అలరించి నవ్వులు ఊహించి గొప్ప స్థానాన్ని ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకున్న వ్యక్తి. అయితే ఓకే అనే డైలాగ్ చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఆ డైలాగ్ వినగానే కొండవలస గారు గుర్తుకొస్తారు అలా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన ఉండవలస గారు 2015 నవంబర్ 2న స్వర్గస్తులయ్యారు.

ఆహుతి ప్రసాద్. మనందరికీ బాగా తెలిసిన నటుడు. సినిమాలలో పలు పాత్రల్లో నటిస్తూ గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఆహుతి సినిమాలో నటించి తర్వాత ఆ పేరుని తన ఇంటి పేరుగా మార్చుకొని పలు సినిమాల్లో మంచి గుర్తింపు పొందిన ఆహుతి ప్రసాద్ గారు 2015 జనవరి 2న మరణించారు.

సుత్తి వేలు. సుత్తివేలు గారు దాదాపు జంధ్యాల గారి అన్ని సినిమాలలో నటించడం జరిగింది. తన కామెడీ, తన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చంటబ్బాయి సినిమాలో చిరుతో చేసిన కామెడీ మామూలుగా ఉండదు. 2013 నవంబర్ 8న ఈయన స్వర్గస్తులయ్యారు.

సుత్తి వీరభద్రరావు. ఈయన సినిమాలలో దాదాపు అన్ని రకాల పాత్రలు పోషించారు. అయితే ఈయన చనిపోయి చాలా రోజులు అయినా చనిపోయే నాటికి ఈయన వయసు కేవలం 42 సంవత్సరాలు. తన హాస్యంతో ప్రజలను బాగా అలరించేవారు.

ఇక మరొక హాస్యనటుడు మల్లికార్జునరావు. ఈయన కొన్ని వందల సినిమాలలో నటించారు. మంచి కామెడీ టైమింగ్, పవన్ కళ్యాణ్ తో ఈయన చేసిన తమ్ముడు సినిమా మంచి గొప్ప పేరు తెచ్చిపెట్టింది. మల్లికార్జున రావు గారు 2008లో చనిపోయారు.

తెలంగాణ శకుంతల. సినిమాలో చిన్న రోల్ అయినా, పెద్ద రోల్ అయినా తన నటన కు తనే సాటి. లక్ష్మీ, ఒక్కడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తన కామెడీతో, ఇంకా కొన్ని యాక్షన్ పాత్రలలో కూడా కామెడీని పండించగల గొప్ప హాస్యనటి తెలంగాణ శకుంతల గారు 2014 జూన్ లో కన్నుమూయడం చాలా బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుందాం.

కళ్ళు చిదంబరం. కళ్ళు సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన దాదాపు అందరూ అగ్ర హీరోల చెంత నటించారు. ఈయన నటనకు ఈయన బాడీ లాంగ్వేజ్ చాలా ప్లస్ పాయింట్. తెరపై ఈయన కనిపించినప్పుడు నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. ఈయన 2015 జనవరి న తనువు చాలించారు.

ఎమ్మెస్ నారాయణ. ఒక హాస్యనటుడుగా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగిన ఈయన దూకుడు, అదుర్స్, అత్తారింటికి దారేది లాంటి ఎన్నో సినిమాలలో నటించి గొప్ప స్టార్ హాస్యనటుగా పేరుపొందారు. ఎమ్మెస్ నారాయణ గారు 2015 జనవరిలో మరణించారు.

బండ జ్యోతి. ఈమె తక్కువ సినిమాల్లో నటించిన కూడా తన పాత్ర ద్వారా ప్రేక్షకులను అలరించారు. అందగాడు శేషాద్రి నాయుడు లాంటి సినిమాలలో ఆమె చేసిన పాత్ర గొప్ప పేరు తీసుకు వచ్చింది కేవలం 41 సంవత్సరాలు ఉన్న ఈమె మరణించడం చాలా బాధాకరం.

విజయ సాయి. కామెడీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించడం జరిగింది. పొట్టి ప్రసాద్ గా మంచి గుర్తింపు వచ్చింది. ధనలక్ష్మి తలుపు తడితే, బ్యాక్ పాకెట్, మిస్టర్ మన్మధ లాంటి సినిమాలలో తన అమాయకపు నటనతో నవ్వులు పూయించిన విజయసాయి 2017 డిసెంబర్ 11న మరణించారు.

వివేక్. వివేక్ గారు తమిళంలో చాలా సినిమాల్లో నటించినా తెలుగు డబ్బింగ్ సినిమాలైనా చాలా సినిమాలలో కనిపించి అందరిని మురిపించారు. రఘువరన్ బీటెక్, శివాజీ, అపరిచితుడు, వివేకం, సుందరాంగుడు లాంటి ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఈయన 2021లో స్వర్గస్తులయ్యారు.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం. టెలివిజన్ రంగం నుండి వెండితెరకు పరిచయమై దాదాపు కొన్ని వందల సినిమాలలో నటించిన ఈయన తెలుగువారికి సుపరిచితుడు. ఎవడి గోల వాడిది, బ్లేడ్ బాబ్జి, దూకుడు లాంటి సినిమాలు ఈయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. 2013 డిసెంబర్ 7న ఈయన మరణించారు.

వేణుమాధవ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సినిమాలలో ఈయన కామెడీ మామూలుగా ఉండదు. ఈయన నటించిన ప్రతి సినిమా ఈయనకు మంచి పేరు తెచ్చింది. లక్ష్మీ సినిమాలో తెలంగాణ శకుంతల తో ఈయన చేసే కామెడీ ఇంకా దిల్, సై లాంటి ఎన్నో సినిమాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. కొన్ని వందల సినిమాలలో నటించి హాస్యం పండించారు. 2019 సెప్టెంబర్ 25న తనువు చాలించారు.

నర్సింగ్ యాదవ్. కమెడియన్ గా, విలన్ గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. 2020 సంవత్సరంలో కన్నుమూశారు.గుండు హనుమంతరావు. రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు వంటి పలు చిత్రాల్లో నటించి మంచి పేరు పొందారు. 2018 ఫిబ్రవరి లో కన్నుమూశారు.

మాడా వెంకటేశ్వరరావు. ముత్యాలముగ్గు సినిమాలో ఎంతగో రాణించిన పలు సినిమాల్లో నటించి తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. 2015 అక్టోబర్ 20న తనువు చాలించారు.రాళ్లపల్లి. నవ్వుల రారాజు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. పలు అగ్ర హీరోల చెంత అనేక సినిమాలలో నటించి తన కామెడీతో అలరించి మెప్పించిన గొప్ప నటుడు రాళ్లపల్లి గారు. 2019లో తనువు చాలించారు.

జయప్రకాశ్ రెడ్డి. సినీ ప్రేక్షకులకు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అందరికీ సుపరిచితుడు. ఈయన చేసే కామెడీ పాత్రలు, పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి తన కామెడీని పండించి 2020 సెప్టెంబర్ 8న స్వర్గస్తులయ్యారు.

జుట్టు నరసింహ గారు. మా పల్లెలో గోపాలుడు, జెంటిల్మెన్, చంటి వంటి చిత్రాలలో నటించి మంచి పేరు పొందిన ఈయన 2009లో మరణించారు.

ఐరన్ లెగ్ శాస్త్రి. ఈయన బ్రహ్మానందం ఇంకా రాజేంద్రప్రసాద్ లతో పలు సినిమాలలో నటించి హాస్యం పండించారు. తన నటనతో ప్రేక్షకులకు కితకితలు పెట్టించిన గొప్ప హాస్యనటుడు. 2006 జూన్ లో మరణించారు.