బిగ్ బాస్ సీజన్ 6 పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్ళే?

గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర మీద ఒక్కసారి మదురైటీ షో లను బిగ్ బాస్ రియాలిటీ షో కూడా మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ప్రస్తుతం ఆరవ సీజన్ ప్రారంభం కానుంది. బుల్లితెర మీద ప్రసారమైన ఐదు బిగ్ బాస్ సీజన్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని టాప్ రేటింగ్స్ తో దూసుకుపోయాయి. అంతేకాకుండా ఇటీవల ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు సీజన్ కూడా మంచి రేటింగ్స్ సాధించింది. చాలా రోజులుగా బిగ్ బాస్ సీజన్ 6 గురించి ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మొదలు కావాల్సిన ఈ రియాలిటీ షో తరచూ వాయిదా పడుతూ వస్తోంది.

ఇదిలా ఉండగా సెప్టెంబర్ రెండవ వారంలో బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే ఎంతోమంది కంటెస్టెంట్ ల పేర్లు బయటికి వస్తున్నాయి. అయితే వాటిలో ఎంతవరకు నిజముందో తెలియదు. తాజాగా బిగ్ బాస్ సీజన్ లో పాల్గొనే కొంతమంది సెలబ్రిటీల పేర్లు బయటకి వచ్చాయి. ఇటీవల వినిపిస్తున్న వార్తలు ప్రకారం ప్రముఖ యాంకర్ మంజుష బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొననుందని సమాచారం. మొన్నటివరకు జబర్థస్త్ లో అనసూయ స్థానంలో నెక్స్ట్ యాంకర్ మంజుషా అని వార్తలు వచ్చాయి. కానీ రష్మి తో సరిపెట్టారు.

బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్లలో హీరో సుమంత్ అశ్విన్ పేరు కూడా వినిపిస్తోంది. సరైన హిట్స్ లేక ఇబ్బందుల్లో ఉన్న సుమంత్ అశ్విన్ బిగ్ బాస్ లో పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ మాష్టర్ భరత్, సీరియల్ యాక్టర్ కౌషిక్, యూట్యూబ్ స్టార్ కుషిత, ట్రాన్స్ జెండర్ తన్మయి, ప్రముఖ ఆర్టిస్ట్ సంజనా చౌదరి, న్యూస్ యాంకర్ పద్మిని, ఆశా సైనీ వంటి వారితో పాటు మరికొందరు కూడా బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియటం లేదు. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమయ్యే తేది కూడా ఫిక్స్ చేయలేదు. బిగ్ బాస్ సీజన్ 6 కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.