ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదు… నేను ఎలాంటి ఆస్తులు అమ్ముకోలేదు క్లారిటీ ఇచ్చిన హీరో?

తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మాధవన్ గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే తాజాగా ఈయన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ది రాకేట్రి అనే సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా ఈ సినిమాని తానే స్వయంగా నిర్మించారు. ఇందులో మాధవన్ నంబి నారాయణన్ పాత్రలో సందడి చేశారు. ఇక ఈ సినిమా విడుదలై మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు సూర్య అతిథి పాత్రలో సందడి చేశారు.

ఇకపోతే ఈ సినిమా హిందీ వర్షన్ లో ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ అతిథి పాత్రలో సందడి చేశారు. ఇక ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ సినిమా వల్ల హీరో మాధవన్ తీవ్రంగా నష్టపోయారని వార్తలు సృష్టించారు. ఈ సినిమాకి ఆయనే నిర్మాతగా వ్యవహరించడం వల్ల ఈ సినిమా వల్ల వచ్చిన నష్టాలను తీర్చడం కోసం ఆస్తులు అమ్మరని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై నటుడు మాధవన్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. తాను రాకెట్రీ సినిమా వల్ల ఎలాంటి నష్టాలను ఎదుర్కోలేదని, అలాగే తాను ఎలాంటి ఆస్తులను కూడా అమ్ముకోలేదని ఈయన తెలిపారు. దేవుడి దయవల్ల ఈ సినిమా ఎలాంటి నష్టాలను ఎదుర్కోలేదని అలాగే భగవంతుడి కృపతో ఒక మంచి సినిమా చేశామని తెలిపారు. ఇక తనకు తన ఇల్లు అంటే ఎంతో ఇష్టమని ఇప్పటికి నేను ఆ ఇంట్లోనే ఉన్నానంటూ ఈ సందర్భంగా ఈయన తన గురించి వస్తున్న వార్తలను కొట్టి పారేశారు.