లాభం లేదు ఇక అనసూయని హీరోయిన్ గా తీసుకోవాల్సిందే ..!

బుల్లితెర మీద తెగ సందడి చేస్తున్న పాపులర్ యాంకర్స్ లో అనసూయ భరద్వాజ్ ఒకరు. చాలా కాలంగా వరసగా టీవీ షోస్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. చెప్పాలంటే యాంకర్ గా అనసూయ కి సినిమా హీరోయిన్ రేంజ్ పాపులారిటీ ని సంపాదించుకుంది. సీనియర్ యాంకర్ సుమ తో పాటు హీరోయిన్ గా చేస్తూ యాంకర్ గా బుల్లితెరని ఊపేస్తున్న రష్మీ గౌతం ఉన్నా కూడా యాంకర్ గా నే కాకుండా సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తున్న అనసూయ కి ప్రత్యేక స్థానం ఉంది.

Kshanam Trailer - Adivi Sesh, Adah Sharma, Anasuya Bharadwaj | 26th FEB  2016 - YouTube

యాంకర్ గానే కాదు నటిగా అనసూయ కి ఉన్న పాపులారిటీ మామూలుది కాదు. ఏ క్యారెక్టర్ చేసినా కూడా తన మార్క్ పార్ఫార్మెన్స్ తో.. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది. సినిమా అవకాశాలు వచ్చినా కూడా తనకి ముందు నుంచి అవకాశాలు వచ్చి గుర్తింపు పొందిన టీవీ షోస్ ని కంటిన్యూ చేస్తుందంటే తన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. సిల్వర్ స్క్రీన్ కి, స్మాల్ స్క్రీన్ కి ఒకేలా ప్రాధాన్యం ఇస్తూ దూసుకుపోతుంది.

Craze more for Anasuya than Samantha | Telugu Movie News - Times of India

అడవి శేష్ కి ఎప్పటికీ రుణపడి ఉంటా అని అనసూయ చెప్పడం కూడా చాలా గొప్ప విషయం. కారణం తనకి క్షణం సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చాడు. ఈ క్యారెక్టర్ తో అనసూయ ప్రేక్షకుల్లో నటిగా విపరీతంగా క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక సుకుమార్ – రాం చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త క్యారెక్టర్ కి ప్రాణం పోసింది. ఈ సినిమాతో అనసూయ కి వచ్చిన పాపులారిటీ అసాధారణం అని చెప్పాలి.

Anchor Anasuya Bharadwaj Beautiful Saree Pics | Latest Indian Hollywood  Movies Updates,Branding Online and Actress Gallery

ప్రస్తుతం క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగ మార్తాండ సినిమాలో కూడా ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్యారెక్టర్ అనసూయ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ లా మిగిలిపోతుందని అంటున్నారు. ఇక బుల్లితెర మీద కొన్ని సార్లు హాట్ గా కనిపించి కూడా యూత్ ని మెస్మరైజ్ చేస్తుంది. గ్లామర్ డోస్ కూడా కాస్త ఎక్కువే చూపిస్తుంది. అందుకే చాలామంది అనసూయ ని హీరోయిన్ గా చూడాలని ఆశపడుతున్నారట.

Anasuya's Beach Picture Goes Viral