ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ఇలా మాట్లాడటానికి కారణం పెద్దదే ..!

రీసెంట్ గా యంగ్ హీరో నితిన్ – టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాని అధికారకంగా ప్రకటించి టైటిల్ తో పాటు ప్రీ లుక్ ని రిలీజ్ చేశారు. చెక్ అన్న టైటిల్ తో పాటు నితిన్ లుక్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఖచ్చితంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కబోతుందని అందరూ ఒక క్లారిటీకి వచ్చేశారు. అయితే ఈ సినిమా అనౌన్స్ అవగానే హీరోయిన్స్ గురించి టాక్ మొదలైంది. ముఖ్యంగా ప్రియా ప్రకాష్ వారియర్ గురించి చాలా ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయట.

Outlook India Photo Gallery - Priya Prakash Varrier

ఓ పది దెకన్లు ఉందో లేదో ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను కొట్టడం.. దానికి స్లో మోషన్ యాడ్ చేసి.. యూత్ ని ఆకట్టుకున్నారు. ఈ ఒక్క వీడియో టీజర్ తో ప్రియా ప్రకాష్ వారియర్ అందరి దృష్ఠిని తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత నుంచి ప్రతీ ఒక్కరు అదే మ్యూజిక్ ని ఊహించుకొని ఆ కన్ను కొట్టింది నాకే అని ఫీలయ్యారు. మొదటి సినిమా ‘ ఒరు అదార్ లవ్ ‘. రిలీజ్ కి ముందే యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ కి వచ్చినంత క్రేజ్ వచ్చేసింది.

Nithin in Check : నితిన్ కొత్త సినిమా టైటిల్ | జాతీయం News in Telugu

అంతే ఇక తెలుగు, తమిళ భాషల్లో యంగ్ హీరోలందరూ ప్రియ ని తమ సినిమాలలో ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నారు. ప్రియ కూడా ఇదే ఛాన్స్ ..ఇండస్ట్రీలో పాతుకుపోవాలని భావించింది. కాని సీన్ రివర్స్ అయింది. మరీ అత్యాశ కి పోయింది. మొదటి సినిమా రిలీజ్ కాకుండా బాలీవుడ్ లో రెండవ సినిమా శ్రీదేవి బంగ్లా లో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ట్రైలర్ తో బాగా పాపులారిటీని సాధించింది. కాని లాభం లేకుండా పోయింది. ఈ ట్రైలర్ బాగా కాంట్రవర్సీ అయి రిలీజ్ కాకుండా నిలిచిపోయింది.

రెండు సినిమాలు రిలీజ్ కాకపోయినా ప్రియా ప్రకాష్ వారియర్ కి ఇండస్ట్రీ వర్గాలలో విపరీతమైన క్రేజ్ మాత్రం దక్కింది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. తనతో ప్రియా ప్రకాష్ పోటీ పడగలదా అని కొంతమంది చర్చించుకుంటున్నారట. దానికి తోడు ప్రియా ప్రకాష్ కి ఇదే తెలుగులో మొదటి సినిమా. ఈ సినిమాలో అసలు ప్రియా ప్రకాష్ కరెక్ట్ ఛాయిస్ కాదేమో అని కూడా మాట్లాడుకుంటున్నారట. మరి నిజంగా ఈ సినిమా తనకి కలిసి వస్తుందా లేదా చూడాలి.