అజిత్‌ని తట్టుకోలేం అంటోన్న టాలీవుడ్ నిర్మాత.!

టాలీవుడ్‌లో ఓ ప్రముఖ నిర్మాత ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్ చేయాలని అనుకుంటున్నాడట. ఓ యంగ్ హీరోతో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా కోసం తమిళ హీరో అజిత్‌నీ, కన్నడ హీరో ఉపేంద్రతోనూ సదరు నిర్మాత సంప్రదింపులు చేస్తున్నాడనీ సమాచారం.

అయితే, అజిత్‌ని అడిగితే రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పాడట. కొన్ని ప్రత్యేకమైన రూల్స్ కూడా పెట్టాడట. దాంతో, అజిత్‌ని స్కిప్ చేసేశాడట. సూర్య కోసం ట్రై చేస్తున్నాడట. సూర్యకూ తెలుగులో మంచి ఫాలోయింగ్ వుంది. సో సూర్య అయినా బాగానే వుంటుందనుకుంటున్నాడట.

ఇటీవల ‘తెగింపు’ సినిమాతో అజిత్ తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయలేకపోయాడు. సూర్యకు ‘విక్రమ్’ సినిమాతో మంచి పేరొచ్చింది. చిన్న గెస్ట్ రోలే అయినా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. చూడాలి మరి, ఈ మల్టీ స్టారర్‌లో నటించే ఛాన్స్ అజిత్, సూర్యలలో ఎవరికి దక్కుతుందో. ఉపేంద్ర సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్ లేదని తెలుస్తోంది.