Prabhas: ప్రభాస్ సలార్ కోసం రంగంలోకి దిగిన సూపర్ స్టార్… ఎవరంటే?

Prabhas: ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోని ఈయన నటించిన రాధేశ్యామ్ సినిమా ఈ నెల 11వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రభాస్ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా సలార్ సినిమా గురించి ప్రభాస్ ను పలు ప్రశ్నలు అడగగా ఈ సినిమా గురించి ప్రభాస్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా ప్రభాస్ శృతిహాసన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం సలార్.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది ఇందులో ప్రధాన పాత్రలో జగపతిబాబు వంటివారు నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ సమాధానం చెబుతూ ప్రముఖ దర్శకుడు, నిర్మాత, మలయాళ సూపర్‌ స్టార్‌ పృథ్వీరాజ్ సుకుమారన్ తమ ‘సలార్‌’లో ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రభాస్ తెలియచేశారు.

ఇక ఈ పాత్రలో పృద్విరాజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఆయనతో కలిసి ఇలా స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రభాస్ విలేకర్ల సమావేశంలో తెలియజేశారు. ఇక సలార్ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యి మంచి గుర్తింపు సంపాదించుకుందని ఈ సందర్భంగా ప్రభాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.