తన గురించి వస్తున్న ట్రోల్స్ పై స్పందించిన రౌడీ హీరో.. నాకు అలవాటైపోయింది అంటూ!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఆగష్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటించింది. తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం భాషలలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాని చార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ ట్రైలర్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా నుండి మరొక పాట కూడా విడుదల చేశారు. ఇక ఆగస్టు 24వ తేదీన ముంబైలో లైగర్ సినిమా ప్రీమియర్ షో వేయనున్నారు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న విజయ్ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో హీరోయిన్ అనన్య పాండే తో కలిసి సందడి చేశాడు. ఈ క్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు విజయ్ సమాధానాలు ఇచ్చాడు. ఈ మేరకు తన గురించి వస్తున్న ట్రోల్స్ పై విజయ్ దేవరకొండ స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సినిమాలలోకి రాకముందు కాలేజీలో స్నేహితులతో పాటు ఆంటీ, అంకుల్స్ అందరూ నన్ను ట్రోల్ చేసేవారు.ఇక సినిమాలోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు ట్రోల్ చేస్తున్నారు. ముందునుండి నాకు ఇవన్ని బాగా అలవాటైపోయాయి. అందుకే నేను వీటి గురించి ఎక్కువగా పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా లైగర్ సినిమా గురించి మాట్లాడుతూ ఇది ఒక తల్లి కొడుకుల మద్య ఉన్న ఎమోషనల్ సినిమా . చాలామంది అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో పోల్చుతున్నారు. ఈ సినిమాలో బాక్సింగ్ కాదు ఎంఎంఎ అనే మార్షల్ ఆర్ట్స్. ఆ సినిమాతో లైగర్ కి ఎలాంటి పోలిక లేదని అన్నారు. సాధారణంగా నేను రీమేక్ సినిమాలు చేయను. కొంత వరకు కథ ఒకేలా ఉన్నా కూడ నేను సినిమా చేసే రకం కాదు అంటూ వెల్లడించాడు.