జాతీయ ఉత్తమ నటి అవార్డు నాకే సొంతం..? వైరల్ అవుతున్న తమన్నా వ్యాఖ్యలు..!

మిల్కీ బ్యూటీ తమన్న ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన తమన్నా ఈమధ్య కాలంలో తెలుగు సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు. ఈమెకు తెలుగులో అవకాశాలు రాక సినిమాలో చేయడం లేదా లేక హిందీలో ఎక్కువ అవకాశాలు రావడం వల్ల తెలుగు సినిమాలు చేయటం లేదా అన్న విషయం అర్థం కావడం లేదు. ఆఖరి సారిగా గని సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన తమన్నా అప్పటినుండి తెలుగు సినిమాలలో కనిపించడం లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తమన్న బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

ఇటీవల తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్ సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మదుర్‌ బండార్కర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో తమన్నా లేడీ బౌన్సర్ గా కనిపించనుంది. ప్రస్తుతం తమన్నా ఈ సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల తమన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ క్రమంలో తమన్నా మాట్లాడుతూ.. లేడీ బౌన్సర్ కథతో మొట్టమొదటిసారిగా తెరకెక్కిన సినిమా ఇది. నా కెరీర్లో ఇది ఒక బెస్ట్ సినిమా అవుతుంది. ఈ సినిమాలో నటించటం నా అదృష్టం. ఇక ఈ సినిమాలో నా నటనకు కచ్చితంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు లభిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేసింది. ఎందుకంటె మదుర బండార్కర్‌ దర్శకత్వంలో చేసిన ఎంతోమంది హీరోయిన్లకు ఉత్తమ అవార్డులు వచ్చాయని, ఈ సినీమాతో తనకు కూడా ఉత్తమ జాతీయ నటి అవార్డు వస్తుందని నాకు నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమా విడుదల తర్వాత తమన్న ఉత్తమ నటి అవార్డ్ తీసుకోవటానికి అర్హురాలో? కాదో? తెలుస్తుంది.