Tollywood: టాలీవుడ్‌లో కోలీవుడ్ డైరెక్టర్ల హవా.. కొత్త కాంబినేషన్లతో మాస్ ఫెస్టివల్!

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు తమిళ దర్శకుల హవా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో తమిళ డైరెక్టర్లతో టాలీవుడ్ హీరోలు అతి కొద్ది సినిమాలు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. స్టార్ హీరోలు వరుసగా కోలీవుడ్ దర్శకులతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇది చిన్న సినిమాలకే పరిమితం కాకుండా, భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కుతుండడం ఆసక్తికరంగా మారింది.

ఇందులో ప్రదానంగా ప్రభాస్ కాంబినేషన్ హైలెట్ అవుతోంది. ‘సలార్’ హిట్ తర్వాత ఆయనకు కోలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ పెరిగింది. ఇప్పుడు తమిళ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయాలని ప్రాధమిక చర్చలు జరుగుతున్నాయట. అదే విధంగా, నాగార్జున కూడా కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ నవీన్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందించే అవకాశం ఉంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సన్ పిక్చర్స్ ముందుకు వచ్చిందని సమాచారం. మరోవైపు, ఎన్టీఆర్ కూడా జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్‌తో ఓ సినిమా చేయనున్నాడట. ‘జైలర్ 2’ పూర్తైన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని టాక్.

ఇక నేచురల్ స్టార్ నాని కూడా కోలీవుడ్ డైరెక్టర్ సిబి చక్రవర్తితో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే, టాలీవుడ్ హీరోలు కోలీవుడ్ దర్శకులతో చేతులు కలిపేస్తున్నారు. భాషల మధ్య గల గీతలను చెరిపేస్తూ, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు ఈ క్రాస్ ఇండస్ట్రీ కాంబినేషన్లు ఎంతవరకు క్లిక్ అవుతాయో చూడాలి.

Ap Assembly: Public EXPOSED Pawan Kalyan & Chandrababu Ruling || Ap Public Talk || Ys Jagan || TR