పక్కకు తప్పుకున్న నాగబాబు మేటర్.. పుష్ప 2 ని కూడా బీట్ అవుట్ చేసిన మంచు ఫ్యామిలీ!

సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న వార్తని సైడ్ చేయాలంటే మరొక ట్రెండింగ్ న్యూస్ హైలెట్ అవ్వాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అదే జరుగుతుంది. చాలా రోజుల నుంచి పుష్ప సినిమా గురించి, పుష్ప టిక్కెట్లు రేట్లు గురించి పుష్ప సాధించిన రికార్డుల గురించి పుష్ప నటన గురించిన వార్తలు సోషల్ మీడియాని షేక్ చేసేసాయి.

ఎక్కడ చూసినా అవే వార్తలు. ఆ తరువాత నాగబాబు మంత్రి పదవిని గురించిన టాపిక్ మరి కొద్ది రోజులు సోషల్ మీడియా లో ట్రెండ్ అయింది. అతనికి మంత్రి పదవి ఏమిటి అంటూ కొందరు నాగబాబు పై ట్రోల్స్ చేశారు. అతనిని సమర్థిస్తూ కొందరు విమర్శిస్తూ కొందరు మొత్తానికి ఆ టాపిక్ ని సోషల్ మీడియాలో హైలెట్ చేసేసారు. అయితే ఇప్పుడు ఆ రెండు న్యూస్ లు ప్రస్తుతం ఫేడ్ అవుట్ అయిపోయాయి.

మంచు ఫ్యామిలీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మోహన్ బాబు ఇంటి గొడవలు చిలికి చిలికి గాలి వాన లాగా మారి చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. ఆ తర్వాత మీడియాపై మోహన్ బాబు చేసిన దౌర్జన్యం సోషల్ మీడియాలో మరింత హైలెట్ అయింది. ప్రస్తుతం మోహన్ బాబు హాస్పిటల్ లో ఉన్నారు. అయితే ఈ న్యూస్ ని సోషల్ మీడియా చాలా బాగా వాడుకుంటుంది.

ప్రతి విషయాన్ని మీమ్స్, ట్రోల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ వార్తలు, ఈ మీమ్స్, ఈ ట్రోల్స్ ఎంతలా హైలెట్ అయ్యాయంటే ఈ హడావుడిలో పడిన నెటిజన్స్ పుష్ప గురించి పట్టించుకోవడం మానేశారు. మామూలుగా అయితే పుష్ప 2 టీం వెయ్యి కోట్ల పోస్టర్ రిలీజ్ చేస్తుందని, ఆ పోస్టర్ ని బన్నీ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేయాలని చాలా పెద్ద ప్లానే వేసుకున్నారు. అయితే సోషల్ మీడియా అంతా మంచు వారి గొడవలతోనే నిండిపోయింది. ఇక మంచి ఫ్యామిలీ ఇష్యూ ఎప్పుడు కొలిక్కి వస్తుందో చూడాలి.