టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి అంచలంచెలుగా ఎదుగుతూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే తన చిన్న కూతురు శ్రీజ కారణంగా ఇంతకాలం సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు కోల్పోతున్నాడు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తన తండ్రి పేరు ప్రఖ్యాతలను పెంచే పనిలో ఉంటే శ్రీజ మాత్రం చిరంజీవి పరువు తీసే పనిలో ఉన్నట్లు అర్థమవుతోంది.
కొంతకాలం క్రితం ఇంటి నుండి పారిపోయి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న శ్రీజ అతనితో ఒక కూతురికి జన్మనిచ్చిన తర్వాత మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత చాలాకాలం తల్లిదండ్రులతో ఉంటున్న శ్రీజకు పెద్దలు కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి రెండవ వివాహం కూడా జరిపించారు. కళ్యాణ్ దేవ్ తో కొంతకాలం సంతోషంగా ఉన్న శ్రీజ అతనితో కూడా ఒక కూతురికి జన్మనిచ్చింది. పాప పుట్టిన కొంతకాలానికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఒకరికొకరు దూరంగా ఉంటూ విడాకులు తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల గురించి మెగా కుటుంబం ఎక్కడ స్పందించలేదు.
తాజాగా సోషల్ మీడియాలో కళ్యాణ్ దేవ్ షేర్ చేసిన ఒక పోస్ట్ వల్ల నిజంగానే శ్రీజ , కల్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నారని అర్థమవుతోంది. చాలా కాలంగా శ్రీజ కి దూరంగా ఉంటున్న కళ్యాణ్ దేవ్ రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కళ్యాణ్ దేవ్ వేరే ఒక అమ్మాయితో చనువుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా జీవితాన్ని మార్చేసిన కలల రాణి అంటూ రాసుకు వచ్చాడు. దీంతో కళ్యాణ్ దేవ్ రెండవ పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి ఈమె అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలా తను చేసుకోబోయే అమ్మాయి ని చూపిస్తూ మెగా కుటుంబానికి కళ్యాణ్ దేవ్ షాక్ ఇచ్చాడని సమాచారం.