జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘దేవర’ షూటింగ్ దశలో ఉంది. గోవాలోని సెట్స్‌లో దేవర అండ్ గ్యాంగ్‌పై వచ్చే చిన్న సెలబ్రేషన్ మ్యూజిక్ బిట్‌ను షూట్ చేసినట్టు ఇటీవలే తారక్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే అప్‌డేట్ అందించింది కొరటాల టీం.
షూట్ సందర్భంగా తారక్ సెట్స్‌లో డ్యాన్సర్లతో కలిసి దిగిన ఫొటోలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వార్త షేర్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు మేకర్స్. దేవర నయా షెడ్యూల్ శంషాబాద్‌లో షూటింగ్ షురూ అయింది. అక్కడి నుంచి రామోజీఫిలిం సిటీకి వెళ్లనుంది తారక్ టీం.
జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు ఇతర కీలక నటీనటులు తాజా షూట్‌లో పాల్గొంటున్నట్టు ఇన్‌సైడ్ టాక్. దేవరలో తారక్ నుంచి ఫ్యాన్స్ ఆశిస్తున్న ఊర మాస్ ఎలిమెంట్స్ సినిమాలో ఉండబోతున్నట్టు ఫస్ట్ లుక్‌తోపాటు బయటకు వచ్చిన స్టిల్స్ చెప్పకనే చెబుతున్నాయి. దేవరలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో (విలన్‌గా) నటిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్, టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా సినిమా అనుకున్న ప్రకారం ఆలస్యం కాకుండా.. క్లైమాక్స్ పోర్షన్‌ను కొరటాల టీం ముందుగానే షూట్ చేసినట్టు సమాచారం. దేవరలో ఎన్టీఆర్‌పై వచ్చే అండర్‌వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ కానుందట. మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. దేవర రెండు పార్టులుగా రాబోతుండగా.. దేవర పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.